డ్యాన్స్ టీచర్‌ అవతారమెత్తిన మహిళా క్రికెటర్…

ఇటీవల రైతు అవతారం ఎత్తిన మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యాన్స్‌ని ఆకట్టుకున్నాడు. తాజాగా మరో లేడీ క్రికెటర్ కూడా బ్యాట్ పక్కన పెట్టి న్యూ లుక్‌లో కనిపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఎవరా క్రికెటర్..? ఎంటా కొత్త అవతారం అనుకుంటున్నారా..?

డ్యాన్స్ టీచర్‌ అవతారమెత్తిన మహిళా క్రికెటర్...

Edited By:

Updated on: Mar 01, 2020 | 1:21 PM

సెలబ్రెటీలు ఏదీ చేసినా జనాల్లో అది వైరల్‌గా మారుతుంది. సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, క్రీడాకారులు చేసే ప్రతి పనిని సాధారణ ప్రజలు తప్పక ఫాలో అవుతుంటారు. ఈ క్రమంలోనే ఇటీవల రైతు అవతారం ఎత్తి మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యాన్స్‌ను ఆకట్టుకోగా.. ఇప్పుడు తాజాగా అదే కోవలో మరో లేడీ క్రికెటర్ కూడా బ్యాట్ పక్కన పెట్టి న్యూలుక్‌లో కనిపిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఎవరా క్రికెటర్..? ఏంటా కొత్త అవతారం అనుకుంటున్నారా..? పూర్తి వివరాలు పరిశీలించగా..

భారతీయ మహిళా క్రికెట్లో అత్యంత చిలిపిగా వ్యవహరిస్తూ అందరితో చలాకీగా కనిపించే యువ ఆల్‌రౌండర్ ఎవరంటే…టక్కున గుర్తుకు వచ్చే పేరు…జెమిమా రోడ్రిగ్స్.. జెమిమా ఇప్పుడు తాజాగా డాన్సర్‌గా కూడా మారారు. ప్రపంచకప్‌లో టీం ఇండియా వరుస విజయాలతో దూసుకుపోతున్న వేళ జెమీ తన ఆటతో పాటు డ్యాన్స్‌తో అందరిని అలరిస్తోంది. ఇటీవల ఒక సెక్యూరిటీ గార్డుతో డాన్స్ చేస్తూ కనబడ్డ జెమీ మరోసారి కొందరు పిల్లలకు డ్యాన్స్ నేర్పించింది. దీన్ని ఏకంగా ఐసీసీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో జెమిమా డాన్సస్ అగైన్ అంటూ పోస్ట్ చేసింది.

ఈ 19 ఏళ్ల క్రికెటర్ జెమిమా.. 2018 లో అంతర్జాతీయ అరంగేట్రం చేసింది… తరువాత, 16 వన్డే ఇంటర్నేషనల్, 43 టి 20 ఇంటర్నేషనల్‌లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుత మహిళల టి 20 ప్రపంచ కప్‌లో, గ్రూప్ దశల్లో భారత్ అజేయంగా నిలిచింది, శనివారం జరిగిన చివరి గ్రూప్ ఎ మ్యాచ్‌లో శ్రీలంకను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై 17 పరుగుల తేడాతో భారత్ తమ ప్రపంచ కప్ వేటను ప్రారంభించింది. ఆ తర్వాత భారత్ 18 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను అధిగమించి, న్యూజిలాండ్‌తో గురువారం జరిగిన చివరి బంతి థ్రిల్లర్‌ను గెలుచుకుంది.