IPL 2022 Mega auction: ఐపీఎల్‌ మెగా వేలానికి ముహూర్తం ఖరారు.. తేదీలు, వేదిక వివరాలివే..

|

Jan 11, 2022 | 9:24 PM

క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌) 2022 మెగా వేలానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా ఈ

IPL 2022 Mega auction: ఐపీఎల్‌ మెగా వేలానికి ముహూర్తం ఖరారు.. తేదీలు, వేదిక వివరాలివే..
ipl
Follow us on

క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌) 2022 మెగా వేలానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా ఈ వేలం జరగనుందని ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ వెల్లడించారు. కాగా ఈ ఏడాది ఐపీఎల్‌ టోర్నీలో కొత్తగా రెండు జట్లు పాల్గొంటున్న సంగతి తెలిసిందే. సంజీవ్ గోయెంకా ఆర్పీఎస్‌జీ గ్రూప్‌కు చెందిన లక్నో ఫ్రాంఛైజీ, సీవీసీ కేపిటల్‌ కు చెందిన అహ్మదాబాద్‌ జట్లు ఈ టోర్నీలో మొదటిసారి తమ అదృష్టం పరీక్షించుకోనున్నాయి. కాగా ఈ కొత్త ఫ్రాంఛైజీలకు ‘లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్’ను జారీ చేయాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ‘రెండు బిడ్‌లను గవర్నింగ్ కౌన్సిల్‌ ఆమోందించింది. దీనికి సంబంధించిన ఎల్‌ఐవోను త్వరలోనే జారీ చేస్తాం. దీనివల్ల మెగా వేలానికి ముందే ఈ రెండు జట్లు తమ ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం ఉంది’ అని ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ వెల్లడించారు.

కాగా లక్నో జట్టుకు కేఎల్ రాహుల్‌, అహ్మదాబాద్‌ జట్టుకు హార్థిక్‌ పాండ్యా సారథ్యం వహించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఆయా ప్రాంఛైజీలు ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు. మరోవైపు తమ సహాయక సిబ్బందిని ఇప్పటికే నియమించుకున్నాయి. కాగా లెటర్‌ ఆఫ్ ఇంటెంట్‌ వల్ల కొత్త జట్లకు రెండు వారాలు ప్లేయర్లను ఎంచుకునే సౌలభ్యముంటుంది. కాగా ఈ ఐపీఎల్‌ సీజన్ భారత్‌లోనే ఐపీఎల్‌ను నిర్వహించాలని భావిస్తున్నట్టు ఐపీఎల్‌ నిర్వాహకులు తెలిపారు.

Also Read:

World Record: ముద్దుగుమ్మ రికార్డులు బద్దలు.. 50 మిలియన్లకు పైగా లైక్‌లు.. అదే ఈ ‘గుడ్డు’ స్పెషల్..

Ravi Teja’s Ravanasura: రవితేజ సినిమాకోసం రంగంలో అక్కినేని యాంగ్ హీరో.. న్యూ లుక్ మాములుగా

లేదుగా..

Viral video: కరోనా కోరలు చాస్తోన్న వేళ.. వానరం అంత్యక్రియలకు 1500 మంది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..