IPL 2021 Suspended: ఐపీఎల్ పై కరోనా కాటు.. నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన బీసీసీఐ

|

May 04, 2021 | 1:57 PM

IPL 2021: కరోనా కారణంగా ఐపీఎల్ 2021 ను నిరవధికంగా వాయిదా వేశారు.

IPL 2021 Suspended: ఐపీఎల్ పై కరోనా కాటు.. నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన బీసీసీఐ
Ipl 2021
Follow us on

IPL 2021: ఐపీఎల్ పై కరోనా కాటేసింది. పలు జట్లలోని ఆటగాళ్ళకు కరోనా పాజిటివ్ రావడంతో ఐపీఎల్ ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. పలువురు ఆటగాళ్లు, సిబ్బంది సోకిన కారణంగా ఐపీఎల్‌ను సస్పెండ్ చేయాలని నిర్ణయించారు. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఈ సమాచారం ఇచ్చారు. వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్, వృద్దిమాన్ సాహా, అమిత్ మిశ్రా అలాగే బౌలింగ్ కోచ్ బాలాజీతో సహా ఇద్దరు ఆటగాళ్ళు, ఇద్దరు కోచింగ్ సిబ్బంది రెండు రోజుల్లో కరోనా బారిన పడ్డారు. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఐపీఎల్ 2021 ఏప్రిల్ 9 వ తేదీన ప్రారంభం అయింది. మే 30 వరకూ జరగాల్సి ఉంది. ఇప్పటివరకూ మొత్తం 29 మ్యాచ్ లు పూర్తయ్యాయి. నిన్న జరగాల్సిన 30 వ మ్యాచ్ ను వాయిదా వేశారు. ఈరోజు ఐపీఎల్ నిరవధికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.

బీసీసీఐ కు భారీ నష్టం..

ఈ ఐపీఎల్‌ రద్దు తో బోర్డుకు సుమారు 2000 కోట్ల నష్టం కలిగిస్తుంది. అలాగే, ఈ ఏడాది భారతదేశంలో నిర్వహించనున్న టి 20 ప్రపంచ కప్ టోర్నమెంట్ కు కూడా ముప్పు పొంచి ఉంటుంది. భారతదేశం వెలుపల ఈ టోర్నీ నిర్వహించడానికి ఐసీసీ ప్రయత్నించే అవకాశం ఉంది. ఇది కూడా జరిగితే బీసీసీఐ కి మరింత నష్టం కలిగిస్తుంది.  బీసీసీఐ ఆదాయంలో ఐపీఎల్ తోనే ఎక్కువగా వసుంది. దీని ద్వారా ప్రభుత్వం సకాలంలో పన్నును పొందుతోంది. 2007-08 నుండి బీసీసీఐ ద్వారా రూ .3500 కోట్లు పన్నుగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. ఈ లీగ్ నుండి బీసీసీఐ 40% ఆదాయాన్ని పొందుతుంది. బీసీసీఐ మధ్యలో ఐపీఎల్ రద్దు చేయడం వల్ల 50% అంటే 2000 కోట్ల నష్టం జరగవచ్చు. దీనితో పాటు, అక్టోబర్‌లో జరిగే ప్రతిపాదిత టి 20 ప్రపంచ కప్‌కు కూడా బోర్డు ఆదాయాన్ని ఆర్జించాలి. బీసీసీఐ ఇటీవల ప్రభుత్వాన్ని ప్రపంచ కప్ నిర్వహణ కోసం పన్ను మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.

Also Read: KKR vs RCB Match Postponed: కరోనా ఎఫెక్ట్.. ఈరోజు జరగాల్సిన కోల్‌కతా నైట్ రైడర్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ వాయిదా!

David Warner: ‘ఇకపై వార్నర్‌ను ఆరెంజ్ జెర్సీలో చూడటం ఇదే చివరిసారి’..