AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shreyas Iyer : భూమిపై స్వర్గం అంటే ఇదేనేమో ? 12 కోట్ల ఖరీదైన శ్రేయస్ అయ్యర్ ఇల్లు చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే

Shreyas Iyer : టీమిండియా స్టార్ క్రికెటర్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముంబైలోని లోధా వరల్డ్ టవర్స్‌లో నివసిస్తున్న లగ్జరీ ఇల్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుమారు రూ.12 కోట్ల విలువైన ఈ 4BHK అపార్ట్‌మెంట్‌లో ఉన్న స్నీకర్ రూమ్, హైటెక్ జిమ్, గేమింగ్ జోన్, వాక్-ఇన్ వార్డ్‌రోబ్ వంటి ప్రత్యేక సదుపాయాలు అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి.

Shreyas Iyer : భూమిపై స్వర్గం అంటే ఇదేనేమో ? 12 కోట్ల ఖరీదైన శ్రేయస్ అయ్యర్ ఇల్లు చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే
Shreyas Iyer
Rakesh
|

Updated on: Apr 29, 2026 | 10:03 AM

Share

Shreyas Iyer : మైదానంలో తన బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను వణికించే టీమిండియా స్టార్ క్రికెటర్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రియల్ లైఫ్ కూడా చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో అయ్యర్ నివసించే ఇల్లు చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. కేవలం క్రికెట్‌పైనే కాదు, ఫ్యాషన్, లగ్జరీ లైఫ్ స్టైల్ పై కూడా మక్కువ చూపే అయ్యర్, తన ఇంటిని ఒక రాజభవనంలా తీర్చిదిద్దుకున్నాడు. సుమారు 12 కోట్ల రూపాయల విలువైన ఈ ఫ్లాట్‌లో ఉన్న సదుపాయాలు, ఆ ప్రత్యేకమైన గదుల గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

శ్రేయస్ అయ్యర్ మూలాలు కేరళలో ఉన్నప్పటికీ అతను పుట్టి పెరిగింది అంతా ముంబైలోనే. లోయర్ పరేల్‌లోని ప్రతిష్టాత్మకమైన లోధా వరల్డ్ టవర్స్‎లో అయ్యర్ నివసిస్తున్నాడు. 48వ అంతస్తులో ఉన్న ఈ 4 BHK అపార్ట్‌మెంట్‌ను ఆయన 2020లో సుమారు 12 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. ఇంటి లోపల అడుగుపెట్టగానే వార్మ్ వుడెన్ ఫ్లోరింగ్, న్యూట్రల్ కలర్ డెకర్ మనల్ని ఆహ్వానిస్తాయి. భారీ గ్లాస్ విండోల ద్వారా ముంబై నగరం మొత్తం కళ్ళ ముందు కనిపిస్తుంది.

క్రికెటర్లలో శ్రేయస్ అయ్యర్‌కు ఒక స్పెషల్ క్రేజ్ ఉంది, అది తన షూ కలెక్షన్. అయ్యర్ ఒక పెద్ద స్నీకర్ హెడ్. తన వద్ద ఉన్న వందలాది బ్రాండెడ్, ప్రీమియం స్నీకర్ల కోసం ఇంట్లో ఒక ప్రత్యేకమైన గదిని కేటాయించారు. ఒక షోరూమ్ తరహాలో ఆ గదిని డిజైన్ చేసి, తన కలెక్షన్ మొత్తాన్ని అక్కడ అమర్చారు. సోషల్ మీడియాలో అయ్యర్ అప్పుడప్పుడు తన షూ రూమ్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు షాక్ ఇస్తుంటాడు.

ఒక అథ్లెట్ కి ఫిట్‌నెస్ ఎంత ముఖ్యమో మనకు తెలిసిందే. అందుకే అయ్యర్ తన ఇంట్లోనే ఒక హై-టెక్ జిమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అద్దాల గోడలు, క్వాలిటీ పరికరాలతో ఉండే ఈ జిమ్ ద్వారా తను ఎప్పుడూ వర్కవుట్లలో బిజీగా ఉంటాడు. అంతేకాదు, అయ్యర్‌కు గేమింగ్ అంటే కూడా చాలా ఇష్టం. దీనికోసం ప్రత్యేకంగా ఒక గేమింగ్ రూమ్‌ను సిద్ధం చేసుకున్నాడు. భారీ స్క్రీన్లు, ఆధునిక కన్సోల్స్‌తో ఈ గది ఒక గేమింగ్ వరల్డ్ లా కనిపిస్తుంది.

ఈ ఇంటికి ఉన్న మరో ప్రధాన ఆకర్షణ భారీ బాల్కనీ. ముంబై నగరం మొత్తం కనిపించేలా ఈ బాల్కనీని డిజైన్ చేశారు. ఇక్కడ మొక్కలు, సౌకర్యవంతమైన సోఫాలు ఏర్పాటు చేశారు. ముంబై లాంటి బిజీ సిటీలో ప్రశాంతంగా గడపడానికి, సూర్యాస్తమయాన్ని చూడటానికి ఇది ఒక పర్ఫెక్ట్ స్పాట్. అలాగే తన దుస్తుల కోసం ఒక వాక్-ఇన్ వార్డ్‌రోబ్, తన వ్యక్తిగత పనుల కోసం ఒక డెన్ గదిని కూడా అయ్యర్ ప్రత్యేకంగా రూపొందించుకున్నాడు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us
12 కోట్ల ఖరీదైన అయ్యర్ ఇల్లు చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే
12 కోట్ల ఖరీదైన అయ్యర్ ఇల్లు చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే
పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలపై కేంద్ర మంత్రి సంచలన స్టేట్‌మెంట్‌!
పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలపై కేంద్ర మంత్రి సంచలన స్టేట్‌మెంట్‌!
కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రధాని మోదీ పూజలు: సర్వార్థ సిద్ధి యోగం..
కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రధాని మోదీ పూజలు: సర్వార్థ సిద్ధి యోగం..
పిల్లలు ఆలస్యంగా మాట్లాడటానికి కారణం ఇదేనట..
పిల్లలు ఆలస్యంగా మాట్లాడటానికి కారణం ఇదేనట..
కేవలం ఛార్జింగ్ 4 గంటలే..105 కి.మీ మైలేజీ.. ధర ఎంతంటే..!
కేవలం ఛార్జింగ్ 4 గంటలే..105 కి.మీ మైలేజీ.. ధర ఎంతంటే..!
ఆయన ఏదో నాకు ఫేవర్ చేస్తున్నట్లు చెప్పాడు.. జేడీ చక్రవర్తి..
ఆయన ఏదో నాకు ఫేవర్ చేస్తున్నట్లు చెప్పాడు.. జేడీ చక్రవర్తి..
నా జీవితాన్ని మార్చేసింది అతడే.. నా లైఫ్‏లో అలాంటి హీరోను చూడలేదు
నా జీవితాన్ని మార్చేసింది అతడే.. నా లైఫ్‏లో అలాంటి హీరోను చూడలేదు
PF చందాదారులకు అలెర్ట్.. అమల్లోకి వచ్చిన 'ఫారమ్ 121'..
PF చందాదారులకు అలెర్ట్.. అమల్లోకి వచ్చిన 'ఫారమ్ 121'..
ట్రైన్ ఒక కిలోమీటర్ నడవడానికి ఎంత ఖర్చవుతుందో తెల్సా..
ట్రైన్ ఒక కిలోమీటర్ నడవడానికి ఎంత ఖర్చవుతుందో తెల్సా..
ఏసీ బోగీలో ఖాళీ ఉందని ఆమెను తీసుకెళ్లాడు.. కట్ చేస్తే..
ఏసీ బోగీలో ఖాళీ ఉందని ఆమెను తీసుకెళ్లాడు.. కట్ చేస్తే..