India Vs England 2021: ఆ ముగ్గురికి అదృష్టం పట్టింది.. ఈ ముగ్గురి ఖేల్ ఖతం.! వారెవరంటే.!!

Ind Vs Eng: ఇంగ్లాండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు టీమిండియా జట్టు. ఈ ముగ్గురి ఎంట్రీ వల్ల మరో ముగ్గురు కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం కనిపిస్తోంది...

India Vs England 2021: ఆ ముగ్గురికి అదృష్టం పట్టింది.. ఈ ముగ్గురి ఖేల్ ఖతం.! వారెవరంటే.!!
Ind Vs Eng

Updated on: Feb 21, 2021 | 5:35 PM

Ind Vs Eng: స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. పెద్దగా మార్పులు ఏమిలేవు గానీ.. ఐపీఎల్‌లో అద్భుతంగా రాణిస్తున్న మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్, ఆల్‌రౌండర్ రాహుల్ తేవాటియా, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌లకు తుది జట్టులో అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే.

ఇక వీరిలో మనం ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ గురించి మాట్లాడుకోవాలి. గత కొన్ని సీజన్ల నుంచి ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున కంసిస్టెంట్‌గా రాణిస్తున్నాడు. ఐపీఎల్ 2020లో 480 పరుగులు చేశాడు. దీనితో అతడిని టీమిండియా జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఇక రాహుల్ తేవాటియా, ఇషాన్ కిషన్‌లు కూడా రంజీ, విజయ్ హజారే ట్రోఫీలలో అద్భుత ప్రదర్శనలు కనబరుస్తున్నారు. అయితే టీమిండియాలోకి ఈ ముగ్గురి ఎంట్రీ వల్ల మరో ముగ్గురు కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం కనిపిస్తోంది. వారే కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్, మనీష్ పాండే.

గత రెండేళ్ల వరకు కుల్దీప్ టీమిండియా వన్డే జట్టులో కీలక ఆటగాడు. అయితే ఇప్పుడు చోటు దొరుకుతుందో.? లేదో.? అనేది డౌట్.. టెస్టుల్లో అవకాశం లభించినా దాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇప్పుడు తేవాటియా రాణిస్తే.. కుల్దీప్ కెరీర్ ప్రశ్నార్ధకమే. సంజూ శాంసన్ తనకి వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20లలో పూర్తిగా విఫలమయ్యాడు. నిలకడలేమి అతడ్ని జట్టుకు దూరం చేస్తోందని చెప్పాలి. ఇక మనీష్ పాండేను గాయం కారణంగా సెలెక్టర్లు ఎంపిక చేయకపోగా.. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ రాకతో అవకాశాలు వస్తాయా.? లేదా.? అనేది చూడాలి.

Also Read: Viral Video: భార్య చిలిపి ముద్దు.. ఆగ్రహించిన భర్త.! జూమ్ మీట్‌లో ఫన్నీ రొమాన్స్.. నెటిజన్లు ఫిదా..