Asian Games 2023: భారత్ ఖాతాలో మరిన్ని స్వర్ణాలు.. మహిళల షూటింగ్‌లో బంగారు పతకం

|

Sep 27, 2023 | 10:57 AM

ఈసారి 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శన చేసి స్వర్ణం సాధించింది. భారతదేశ షూటింగ్ బృందంలో మను భాకర్, ఇషా సింగ్, రిథమ్ సాంగ్వాన్ త్రయం ఉన్నారు. ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇది 16వ పతకం. అంతకుముందు నాలుగో రోజు 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ల మహిళల జట్టు రజతంతో పతకాల్లో భారత్ ఖాతా తెరిచింది.

Asian Games 2023: భారత్ ఖాతాలో మరిన్ని స్వర్ణాలు.. మహిళల షూటింగ్‌లో బంగారు పతకం
Gold Medal In Shooting
Follow us on

ఆసియా క్రీడలు 2023లో భారత్ నాల్గవ స్వర్ణాన్ని గెలుచుకుంది. 25 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో భారత మహిళల జట్టు స్వర్ణం దక్కించుకుంది. భారతదేశ షూటింగ్ బృందంలో మను భాకర్, ఇషా సింగ్, రిథమ్ సాంగ్వాన్ త్రయం ఉన్నారు. ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇది 16వ పతకం. అంతకుముందు నాలుగో రోజు 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ల మహిళల జట్టు రజతంతో పతకాల్లో భారత్ ఖాతా తెరిచింది.

కాగా 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో మను భాకర్, ఇషా సింగ్, రిథమ్ సాంగ్వాన్ 1759 పాయింట్లు సాధించారు. ఆతిథ్య చైనా జట్టు 1756 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. చైనా రజతం సాధించింది. ఆసియా క్రీడలు ప్రారంభమైన మూడోరోజున భారత గుర్రపు స్వారీ చరిత్ర సృష్టించింది. 41 ఏళ్ల తర్వాత బంగారు పతకం దక్కించుకోవడం విశేషం.

ఇలా భారత్ ఇప్పటి వరకు నాలుగు బంగారు పతకాలు..

రెండో రోజు షూటింగ్‌లో భారత్‌కు తొలి స్వర్ణం వచ్చింది. ఆ తర్వాత రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఉమెన్స్ జట్టు గోల్డ్ సాధించింది. గుర్రపు స్వారీ జట్టు దేశానికి మూడో స్వర్ణం అందించింది. ఈసారి మహిళల జట్టు దేశానికి స్వర్ణం అందించింది.

భారత్‌కు 16 పతకాలు..

ఆసియా క్రీడల్లో నాలుగో రోజు భారత్‌ పేరిట ఇప్పటివరకు మొత్తం 16 పతకాలు నమోదయ్యాయి. 16లో 4 స్వర్ణాలు, 5 రజతాలు, 7 కాంస్యాలు ఉన్నాయి. నాలుగో రోజు భారత్ ఖాతాలో ఇప్పటివరకు రెండు పతకాలు చేరాయి. దేశ ఖాతాలో తొలి పతకం రజతం రూపంలో చేరింది. ఇప్పటి వరకు రెండు పతకాలు భారత మహిళల జట్లే గెలుచుకున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం