రెండో వన్డేలో భారత్‌ సమిష్టి విజయం.. సిరీస్ సమం!

రాజ్ కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమం అయింది.  భారత్ నిర్దేశించిన 341 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే 304 పరుగులకు ఆలౌట్ అయింది. మ్యాచ్ ఆరంభంలో వికెట్ల కోసం చెమటోడ్చిన భారత బౌలర్లు ఆ తర్వాత విజృంభించారు. 38వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు […]

రెండో వన్డేలో భారత్‌ సమిష్టి విజయం.. సిరీస్ సమం!

Edited By:

Updated on: Jan 17, 2020 | 10:34 PM

రాజ్ కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమం అయింది.  భారత్ నిర్దేశించిన 341 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే 304 పరుగులకు ఆలౌట్ అయింది.

మ్యాచ్ ఆరంభంలో వికెట్ల కోసం చెమటోడ్చిన భారత బౌలర్లు ఆ తర్వాత విజృంభించారు. 38వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీయడంతో భారత శిబిరంలో ఆశలు చిగురించాయి. జోరుమీదున్న స్మిత్‌ను సెంచరీ ముంగిట బౌల్డ్ చేసి ఆసీస్‌కు ఝలకిచ్చాడు. 44వ ఓవర్లో తొలి రెండు బంతుల్లోనూ రెండు వికెట్లు తీసిన మహ్మద్ షమీ ఆసీస్ విజయావకాశాలను దారుణంగా దెబ్బతీసి భారత్‌కు విజయాన్ని చేరువ చేశాడు. ఆటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ రాణించిన భారత్ సమష్టిగా విజయాన్ని అందుకుంది.