AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Japan T20: జియోస్టార్‌లో భారత్ – జపాన్ టీ20 మ్యాచ్ రాదు.. మరి ఎక్కడ లైవ్ చూడాలంటే?

India vs Japan T20: భారత్, జపాన్ మధ్య సెప్టెంబర్ 22న జరగనున్న చారిత్రక టీ20 మ్యాచ్‌ను జియోస్టార్‌లో చూడలేరు. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. అభిమానులు ఫ్యాన్‌కోడ్ యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు.

India vs Japan T20: జియోస్టార్‌లో భారత్ - జపాన్ టీ20 మ్యాచ్ రాదు.. మరి ఎక్కడ లైవ్ చూడాలంటే?
Ind Vs Jap
Rakesh
|

Updated on: Sep 21, 2026 | 3:40 PM

Share

India vs Japan T20: క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారత్, జపాన్ దేశాల మధ్య ఒక చారిత్రక టీ20 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. భారత్, జపాన్ దేశాల మధ్య ఉన్న దౌత్య సంబంధాలకు 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్పోర్ట్ 75 ప్రత్యేక ద్వైపాక్షిక సాంస్కృతిక క్రీడా కార్యక్రమంలో భాగంగా ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు. జపాన్‌లోని సనో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఈ అద్భుతమైన పోరు జరగనుంది. రెండు దేశాల క్రికెట్ జట్లు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో పరస్పరం తలపడటం చరిత్రలో ఇదే మొదటిసారి కావడంతో క్రికెట్ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.

జియోస్టార్‌లో రాదు.. లైవ్ ఎక్కడ చూడాలంటే?

సాధారణంగా భారత్‌లో జరిగే లేదా భారత జట్టు ఆడే చాలా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు లేదా జియోస్టార్ వంటి ఛానెళ్లలో వస్తుంటాయి. అయితే, ఈ ప్రత్యేకమైన భారత్ – జపాన్ మ్యాచ్‌ను మాత్రం జియోస్టార్‌లో ప్రసారం చేయడం లేదు. దీంతో క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్‌ను ఎక్కడ చూడాలనే దానిపై ఆందోళన చెందుతున్నారు. ఈ చారిత్రక మ్యాచ్‌కు సంబంధించిన లైవ్ టెలికాస్ట్ హక్కులను ఫ్యాన్‌కోడ్ సొంతం చేసుకుంది. కాబట్టి అభిమానులు ఈ మ్యాచ్‌ను కేవలం ఫ్యాన్‌కోడ్ మొబైల్ యాప్, అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే లైవ్‌లో వీక్షించవచ్చు.

మ్యాచ్ సమయం, పూర్తి వివరాలు

ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్.. భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 22న ఉదయం సరిగ్గా 9:30 గంటలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది. జపాన్‌లో జరుగుతున్న ఈ పర్యటన కోసం భారత జట్టు ఇప్పటికే అక్కడకు చేరుకుంది. అంతేకాకుండా ఇదే దేశంలో కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఏషియన్ గేమ్స్ కోసం కూడా టీమిండియా సన్నాహాలు ముమ్మరం చేసింది. జపాన్‌తో జరిగే ఈ ఒక్క మ్యాచ్ కోసం బీసీసీఐ ఏకంగా శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో ప్రధాన జట్టును బరిలోకి దింపుతుండటం విశేషం.

టీమిండియా స్క్వాడ్

ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన భారత జట్టులో పలువురు స్టార్ ఆటగాళ్లకు చోటు దక్కింది. శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్) నేతృత్వంలో తిలక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్ బరిలోకి దిగనున్నారు. అయితే, కొన్ని అనివార్య కారణాలు, గాయాల కారణంగా వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. వారి స్థానంలో విప్రాజ్ నిగమ్, యశ్ ఠాకూర్ జట్టులోకి ఎంపికయ్యారు. వెస్టిండీస్ సిరీస్ కారణంగా నితీష్ కుమార్ రెడ్డి కూడా ఈ టీ20 నుంచి తప్పుకున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..