Ashwin is Chepauk Master: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పట్టుబిగిస్తోంది. ఆతిధ్య జట్టు ఇంగ్లండ్ చుట్టూ స్పిన్ వలతో ఉచ్చు బిగిస్తోంది. అయితే ఈరోజు రెండో టెస్టు లో భారత్ విజయం దిశగా అడుగులు వేయడానికి ముఖ్య పాత్ర పోషించినవారిలో ఆల్ రౌండర్ ప్రతిభకనిబరిచిన రవిచంద్రన్ అశ్విన్ ఒకరు. తన సొంత గడ్డపై జరుగుతున్న మ్యాచ్ లో అశ్విన్ ఆల్ రౌండర్ ప్రదర్శన చేస్తున్నాడు..తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసి.. ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ పనిపడితే.. రెండో ఇన్నింగ్స్ లో కీలక సమయంలో ఏకంగా సెంచరీ చేసి భారత్ రెండో టెస్టు గెలుపుకు బాటలు వేశాడు..
ఈ నేపథ్యంలో అశ్విన్ భార్య ప్రీతి అశ్విన్ చేసిన ఓ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన తాజా సినిమా మాస్టర్ పోస్టర్ ను ఎవరో మార్పింగ్ చేసి విజయ్ ప్లేస్ లో అశ్విన్ ఫోటోను అతికించారు. ఆ ఫోటోను తన ట్విట్టర్ లో షేర్ చేసిన ప్రీతి .. ఇలా ఎవరు చేశారు అంటూ ఓ స్మైలీ ఎమోజీని యాడ్ చేసింది.
Who did this ? pic.twitter.com/opmD6oRq0o
— Prithi Ashwin (@prithinarayanan) February 15, 2021
ఇక రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ ఏడో వికెట్ కోల్పోయింది. భారత్ గెలుపు ముంగిట నిలిచింది.