India Vs Australia
India Vs England 2021: ఆస్ట్రేలియాలో చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుని ఫుల్ జోష్ మీదున్న టీమిండియా.. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో సుదీర్ఘ సిరీస్‌కు సన్నద్ధం అవుతోంది. ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్‌లో మొదట టెస్టులు, ఆ తర్వాత టీ20లు, వన్డేలు జరగనున్నాయి. ఇప్పటికే తొలి రెండు టెస్టులకు టీమ్‌ను ప్రకటించిన బీసీసీఐ.. పితృత్వ సెలవులపై వెళ్లిన విరాట్ కోహ్లి తిరిగి జట్టు పగ్గాలు చేపట్టనుండగా.. ఇషాంత్ శర్మ, హార్దిక్ పాండ్యాలు తుది జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే. యువ పేసర్ నటరాజన్‌కు రెస్ట్ ఇచ్చిన సెలెక్టర్లు.. ఆస్ట్రేలియాలో భారత్ జట్టును గెలిపించిన హీరోలు పంత్, గిల్, మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్‌లకు తొలి రెండు టెస్టుల్లోనూ చోటు ఇచ్చారు. కాగా, భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న పూర్తి షెడ్యూల్ ఇలా ఉంది.. మీరు కూడా ఓ లుక్కేయండి..
నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్
తేదీలు |
వేదిక |
మొదటి టెస్టు – ఫిబ్రవరి 5-9(ఉదయం 9.30) |
చెన్నై |
రెండో టెస్టు – ఫిబ్రవరి 13-17(ఉదయం 9.30) |
చెన్నై |
మూడో టెస్టు(డే/నైట్)- ఫిబ్రవరి 24-28(మధ్యాహ్నం 2.30 నిమిషాలు) |
అహ్మదాబాద్ |
నాలుగో టెస్టు – మార్చి 4-8(ఉదయం 9.30 నిమిషాలు) |
అహ్మదాబాద్ |
ఐదు టీ20 మ్యాచ్‌లు
తేదీలు |
వేదిక |
తొలి టీ20: మార్చి 12రాత్రి 7 గంటలకు |
అహ్మదాబాద్ – మొతేరా స్టేడియం |
రెండో టీ20: మార్చి 14 |
అహ్మదాబాద్ – మొతేరా స్టేడియం |
మూడో టీ20: మార్చి 16 |
అహ్మదాబాద్ – మొతేరా స్టేడియం |
నాలుగో టీ20: మార్చి 18 |
అహ్మదాబాద్ – మొతేరా స్టేడియం |
ఐదో టీ20: మార్చి 20 |
అహ్మదాబాద్ – మొతేరా స్టేడియం |
మూడు వన్డేలు
తేదీలు |
వేదిక |
తొలి వన్డే: మార్చి 23(మధ్యాహ్నం 1.30 నిమిషాలు) |
పుణె |
రెండో వన్డే: మార్చి 26 |
పుణె |
మూడో వన్డే: మార్చి 28 |
పుణె |
తొలి రెండు టెస్టులకు భారత జట్టు ఇదే…
విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్య రహానే(వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, రిషబ్ పంత్, మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, శార్దూల్ ఠాకూర్, మయాంక్ అగర్వాల్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, చతేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్