Team India: ఆస్ట్రేలియా రికార్డును అధిగమించిన భారత్.. పాకిస్తాన్ పై విజయంతో ఈ ఫీట్ సాధించిన టీమిండియా..
అంతర్జాతీయ క్రికెట్ లో భారత్ మరో రికార్డును అధిగమించింది. టీ20 ప్రపంచ కప్ లో భాగంగా అక్టోబర్ 23వ తేదీ ఆదివారం పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా ఒక క్యాలెండర్ ఇయర్ లో అంతర్జాతీయ క్రికెట్..
అంతర్జాతీయ క్రికెట్ లో భారత్ మరో రికార్డును అధిగమించింది. టీ20 ప్రపంచ కప్ లో భాగంగా అక్టోబర్ 23వ తేదీ ఆదివారం పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా ఒక క్యాలెండర్ ఇయర్ లో అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. ఇప్పటివరకు ఆస్ట్రేలియా పేరిట ఉన్న ఈ రికార్డును భారత్ బద్దలు కొట్టింది. ఆదివారం మెల్‌బోర్న్‌లో జరిగిన T20 ప్రపంచ కప్ 2022లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించడం ద్వారా ఒక క్యాలెండర్ ఇయర్ లో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక విజయాలు సాధించిన ఆస్ట్రేలియా జట్టు రికార్డును భారత్ తిరగరాసింది. ఇప్పటివరకు ఆస్ట్రేలియా ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా రికార్డును కలిగి ఉంది. 2003వ సంవత్సరంలో 47 మ్యాచ్‌లలో 38 విజయాలతో ఈ ఫీట్‌ను సాధించింది. ఈ ఏడాది 56 మ్యాచ్‌లలో భారత్ ఇప్పటివరకు 39 విజయాలు సాధించి ఆస్ట్రేలియా రికార్డును బద్దలు కొట్టింది. ఈ ఏడాది క్యాలిండర్ ఇయర్ లో భారత క్రికెట్ జట్టు విజయ యాత్రను కొనసాగించింది. ఈ ఏడాది ప్రారంభంలో వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన టీ20, వన్డే సిరీస్ లో ప్రత్యర్థి జట్టును 3-0తో వైట్‌వాష్ చేసింది. ఆ తర్వాత భారత్ శ్రీలంకతో స్వదేశంలో సిరీస్ ఆడింది. టీ20 సిరీస్‌ను 3-0తో, టెస్టు సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. దీని తర్వాత, టీమిండియా దక్షిణాఫ్రికాతో స్వదేశంలో ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్‌ను ఆడింది, చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దుకాగా, ఆ సిరీస్ 2-2తో డ్రా అయింది.
వెస్టీండిస్ లో పర్యటించిన భారత జట్టు టీ20 సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకోగా.. వన్డే సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. ఆ తర్వాత జింబాబ్వేకు వెళ్లిన భారత్ వన్డే సిరీస్‌లో ఆతిథ్య జట్టును 3-0తో వైట్‌వాష్ చేసింది. ఆసియా కప్ 2022లో బాగా ఆడినప్పటికి ఫైనల్స్ చేరుకోవడంలో విఫలమైంది.
టీ20 ప్రపంచ కప్ కు ముందు ఆస్ట్రేలియా జట్టు భారత్ లో పర్యటించింది. టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న భారత్ ఆసియా కప్ సాధించలేకపోయామన్న ఓటమి నుంచి పుంజుకుంది. ఆ తర్వాత వన్డే, టీ20 సిరీస్‌లలో దక్షిణాఫ్రికాపై గెలిచి భారత్ ఆస్ట్రేలియా రికార్డును సమం చేసింది. టీ20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో విజయం ద్వారా టీమిండియా ఆస్ట్రేలియా రికార్డును బద్దలు కొట్టి సరికొత్త రికార్డు నమోదు చేసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..