Telangana: క్రీడాకారులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో టైగర్ ఇండియా ఖేలో ఫుట్‌బాల్ సీజన్ 4 ట్రయల్స్.. వివరాలివే

|

Oct 21, 2024 | 2:39 PM

ప్రతిభ గల ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు ఉచితంగా శిక్షణ ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడేలా తీర్చిదిద్దడమే ఇండియా ఖేలో ఫుట్‌బాల్‌ (ఐకేఎఫ్‌) లక్ష్యం. ఇందుకోసం సౌత్‌క్లాన్‌ ఫుట్‌బాల్‌ అకాడమీతో కలిసి ఆటగాళ్ల ఎంపికకు పోటీలు నిర్వహిస్తోంది.

Telangana: క్రీడాకారులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో టైగర్ ఇండియా ఖేలో ఫుట్‌బాల్ సీజన్ 4 ట్రయల్స్..  వివరాలివే
India Khelo Footbal Season
Follow us on

తెలంగాణలోని ఫుట్ బాల్ క్రీడాకారులకు శుభవార్త. టైగర్ ఇండియా ఖేలో ఫుట్‌బాల్ సీజన్ 4 ట్రయల్స్ కు రంగం సిద్ధమైంది. త్వరలోనే తెలంగాణలోని పలు జిల్లాల్లో పోటీలు ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం ఇండియా ఖేలో ఫుట్‌బాల్ (IKF), టైగర్ క్యాపిటల్, హైదరాబాద్ లిటిల్ స్టార్స్ సాకర్ అకాడమీ, సౌత్ క్లాన్ ఫుట్‌బాల్ క్లబ్‌ సంయుక్తంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.టైగర్ ఇండియా ఖేలో ఫుట్‌బాల్ సీజన్ 4 ట్రయల్స్ మెదక్, హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్‌లో జరగనున్నాయి. హైదరాబాద్ లోని ల్కొండ కోట వెనుక ఉన్న ఆర్టిలరీ సెంటర్ ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో అక్టోబర్ 26-27 తేదీల్లో ఈ పోటీలు జరగనున్నాయి. 2007-2013 మధ్య జన్మించిన అబ్బాయిలు, అమ్మాయిలు https://indiakhelofootball.com/season4ని వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎవరైనా మెదక్, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్‌లో కూడా నమోదు చేసుకోవాలనుకుంటే కూడా ఇదే లింక్‌ను ఉపయోగించవచ్చు. ట్రయల్స్‌కు హాజరయ్యే ఆటగాళ్లు మొదట సిటీ ట్రయల్స్ నుండి స్కౌట్ కు ఎంపికవుతారు. ఆ తర్వాత జోనల్ ఫైనల్స్, ఫైనల్స్‌కు సెలెక్ట్ అవుతారు. ఇక్కడ అన్ని ISL, I లీగ్, టాప్ అకాడమీలు ఆటగాళ్లను స్కౌట్ చేయడానికి, వారికి ఫుట్‌బాల్ ఆడటానికి అవకాశం కల్పిస్తాయి.

 

వెనక బడిన ప్రాంతాల నుండి ఫుట్ బాల్ క్రీడాకారులను గుర్తించి, వారికి శిక్షణతో పాటు మెరుగైన అవకాశాలు కల్పించడమే ఏకైక లక్ష్యంగా ఇండియా ఖేలో ఫుట్‌బాల్ (IKF), టైగర్ క్యాపిటల్, హైదరాబాద్ లిటిల్ స్టార్స్ సాకర్ అకాడమీ, సౌత్ క్లాన్ ఫుట్‌బాల్ క్లబ్‌ తెలంగాణలో ఫుట్‌బాల్‌ను విప్లవాత్మకంగా మార్చడమే తమ లక్ష్యమంటున్నారీ ఈ అకాడమీ నిర్వాహకులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..