T20 World Cup: టీ20 ప్రపంచకప్ లో బూమ్రా ఆడకపోవడంపై ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు..

|

Oct 07, 2022 | 2:07 PM

ఈ ఏడాది అక్టోబర్ 16వ తేదీ నుంచి నవంబర్ 13వ తేదీ వరకు ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ మొదలు కానుంది. అయితే భారత్ అక్టోబర్ 23వ తేదీన పాకిస్తాన్ తో సూపర్ 12లో తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే భారత క్రికెట్ జట్టు ఈ మెగా టోర్ని కోసం ఆస్ట్రేలియా చేరుకుంది. అయితే ఈ టోర్నమెంట్ కు పేసర్ జస్ప్రీత్ బూమ్రా గాయం కారణంగా దూరం..

T20 World Cup: టీ20 ప్రపంచకప్ లో బూమ్రా ఆడకపోవడంపై ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు..
Ravi shastri and Bumrah
Follow us on

ఈ ఏడాది అక్టోబర్ 16వ తేదీ నుంచి నవంబర్ 13వ తేదీ వరకు ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ మొదలు కానుంది. అయితే భారత్ అక్టోబర్ 23వ తేదీన పాకిస్తాన్ తో సూపర్ 12లో తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే భారత క్రికెట్ జట్టు ఈ మెగా టోర్ని కోసం ఆస్ట్రేలియా చేరుకుంది. అయితే ఈ టోర్నమెంట్ కు పేసర్ జస్ప్రీత్ బూమ్రా గాయం కారణంగా దూరం అయ్యాడు. బూమ్రా ఆడకపోతుండటంతో ఇది భారత జట్టుకు పెద్ద లోటుగానే చెప్పుకోవాలి. అయితే బుమ్రా స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారనే చర్చ సాగుతోంది. త్వరలోనే బీసీసీఐ దీనిపై నిర్ణయం తీసుకోనుంది. స్టాండ్ బై ప్లేయర్లుగా ఉన్న మహ్మద్ షమి, దీపక్ చాహర్ లలో ఒకరికి అవకాశం దక్కవచ్చని అంతా భావిస్తున్నారు. మరోవైపు హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ పేరు కూడా వినబడుతోంది. ఈలోపు బుమ్రా స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిపై ఒక్కొక్కరు ఒక్కోలా విశ్లేషిస్తున్నారు. కొంతమంది మహ్మద్ షమి బెటర్ అంటుంటే.. మరికొంతమంది సిరాజ్ సరైనోడంటూ విశ్లేషిస్తున్నారు. దీనిపై కొంత భిన్నంగా స్పందించాడు. భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి. గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా, జడేజా టీ20 ప్రపంచకప్ కు దూరం కావడం వల్ల ఒత్తిడిలో కూడా మంచి ప్రదర్శన ఇచ్చేందుకు మరో ఆటగాడికి అవకాశం లభిస్తుందన్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్న రవీంద్ర జడేజా కూడా టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. బుమ్రా, జడేజా గాయపడడం వల్ల మరొకరు తీవ్ర ఒత్తిడిలో నిలబడి ప్రదర్శన ఇచ్చేందుకు అవకాశం ఉందని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. వీరిద్దరూ గాయాల కారణంగా మ్యాచ్ కు దూరం కావడం దురదృష్టకరమని, అయితే ఇది మరో ఆటగాడికి అద్భుత అవకాశమని రవిశాస్త్రి తన అభిప్రాయంగా చెప్పాడు.

గాయంతో వారిద్దరూ ఏమి చేయలేరని రవిశాస్త్రి తెలిపారు. అయినా సరే భారతక జట్టులో బాగా ఆడగల క్రికెటర్లు ఉన్నారని, తగినంత బలం ఉందని భావిస్తున్నట్లు తెలిపాడు. సెమీ ఫైనల్స్ కు చేరుకుంటే కప్ ఎవరినైనా వరించవచ్చని రవిశాస్త్రి తెలిపాడు. ప్రారంభ మ్యాచ్ లు బాగా ఆడి, సెమీఫైనల్స్ కు చేరుకుంటే ఆ తర్వాత కప్ గెలవడానికి అవసరమైన బలం టీమిండియాకు ఉందని అభిప్రాయపడ్డాడు ఈ మాజీ కోచ్. అందరికి తెలిసింది బూమ్రా, జడేజా మ్యాచ్ ఆడకపోవడం, ఇది కొంతమేర జట్టుకు నష్టం కలిగిస్తుంది. అయితే మరో కొత్త ఛాంపియన్ ను వెలికితీసేందుకు ఇదో అవకాశమని రవిశాస్త్రి తెలిపాడు.

మహ్మద్ షమి గురించి రవిశాస్త్రి మాట్లాడుతూ.. మహ్మద్ షమీకి ఆస్ట్రేలియా వికెట్ పై ఆడిన అనుభవం ఉందని, గత కొన్నేళ్లుగా ఎన్నో మ్యాచ్ లు ఆడాడని, ఆ అనుభవం టీ20 ప్రపంచకప్ లో పనికొస్తుందని రవిశాస్త్రి వ్యాఖ్యానించారు. కాగా భారత క్రికెట్ జట్టు ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకోగా.. అక్టోబర్ 10, 13 తేదీల్లో వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరిగే రెండు ప్రాక్టీస్ మ్యాచ్ లను భారత్ ఆడనుంది. అలాగే అక్టోబర్ 17న ఆస్ట్రేలియాతో, అక్టోబర్ 19వ తేదీన న్యూజిలాండ్ తో రెండు వార్మప్ మ్యాచ్‌లను కూడా భారత్ ఆడనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..