India – New Zealand: సిరీస్ విజేత ఎవరో తేలేది నేడే.. రసవత్తరంగా మ్యాచ్.. ప్లేయింగ్ XIలో స్వల్ప మార్పులు..

|

Feb 01, 2023 | 7:17 PM

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న పోరు కీలకంగా మారనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ లో ప్రస్తుతం 1-1తో రెండు జట్లు సమంగా ఉన్నాయి. ఈ మ్యాచ్ పూర్తయితే.. సిరీస్‌ విజేత..

India - New Zealand: సిరీస్ విజేత ఎవరో తేలేది నేడే.. రసవత్తరంగా మ్యాచ్.. ప్లేయింగ్ XIలో స్వల్ప మార్పులు..
India New Zealand
Follow us on

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న పోరు కీలకంగా మారనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ లో ప్రస్తుతం 1-1తో రెండు జట్లు సమంగా ఉన్నాయి. ఈ మ్యాచ్ పూర్తయితే.. సిరీస్‌ విజేత ఎవరన్నది తేలనుంది. టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌ కు సహకరించే ఈ పిచ్‌పై ఇరు జట్లు ప్లేయింగ్ ఎలెవన్‌లో 1-1 మార్పులు మాత్రమే చేశాయి. అయితే టీమ్ ఇండియాలో అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మార్పు జరగలేదు. గత మ్యాచ్‌లో కూడా పృథ్వీ షాకు అవకాశం రాలేదు. చివరి మ్యాచ్ విజయం తర్వాత.. టీమ్ ఇండియా ప్లేయింగ్ లెవన్‌లో ఒకే ఒక్క మార్పు చేస్తూ ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌ను రంగంలోకి దించింది. అనుభవజ్ఞుడైన లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఉమ్రాన్ కోసం ఆ స్థానాన్ని ఖాళీ చేశాడు. గత మ్యాచ్‌లోనే జట్టులోకి వచ్చిన చాహల్ 2 ఓవర్లలో 6 పరుగులిచ్చి 1 వికెట్ తీసుకున్నప్పటికీ అతను ఆ స్థానాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. న్యూజిలాండ్ మీడియం పేసర్ జాకబ్ డఫీని తప్పించి బెన్ లిస్టర్‌ను కూడా రంగంలోకి దించింది. ఈ లెఫ్టార్మ్ మీడియం పేసర్ అంతర్జాతీయ అరంగేట్రం చేస్తున్నాడు.

ఈ మ్యాచ్ లో యువ ఓపెనర్ పృథ్వీ షాకు అవకాశం లభిస్తుందని అందరూ అనుకున్నారు. గత రెండు మ్యాచ్‌లలో శుభమన్ గిల్, ఇషాన్ కిషన్ జోడి పూర్తిగా ఫ్లాప్ అయ్యింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇద్దరు బ్యాట్స్‌మెన్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో రెండ్రోజుల క్రితం రంజీ ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీ సాధించిన పృథ్వీ షా.. ప్లేయింగ్ లెవన్‌లో కనిపిస్తాడని భావించారు. కానీ అది జరగలేదు.

భారత్ ప్లేయింగ్ XI: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభమన్ గిల్, ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, శివమ్ మావి, అర్ష్‌దీప్ సింగ్ మరియు ఉమ్రాన్ మాలిక్.

ఇవి కూడా చదవండి

న్యూజిలాండ్ ప్లేయింగ్ XI : మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, ఫిన్ అలెన్, డారిల్ మిచెల్, మార్క్ చాప్‌మన్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్, బెన్ లిస్టర్.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..