సెలెక్షన్ కమిటీపై తీవ్ర విమర్శలు… ఎమ్మెస్కే ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు!

| Edited By:

Jul 31, 2019 | 9:10 PM

వరల్డ్ కప్ సెమీఫైనల్‌లోనే టీమిండియా నిష్క్రమించడం, అంబటి రాయుడికి జట్టులో చోటు దక్కకపోవడం లాంటి పరిణామాలతో… కోహ్లీ కెప్టెన్సీపై, సెలెక్షన్ కమిటీపై భారత క్రికెట్ మాజీలు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. సెలెక్టర్లకు ముందు చూపు లేదనే కామెంట్లు కూడా వచ్చాయి. ఈ ఆరోపణల పట్ల సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించారు. సెలక్షన్ కమిటీకి విజన్ లేదని విమర్శిస్తున్నారు… మాకు విజన్ లేకపోతే.. పరిమిత ఓవర్ల క్రికెటర్ అయిన బుమ్రా టెస్టుల్లోకి ఎలా […]

సెలెక్షన్ కమిటీపై తీవ్ర విమర్శలు... ఎమ్మెస్కే ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు!
Follow us on

వరల్డ్ కప్ సెమీఫైనల్‌లోనే టీమిండియా నిష్క్రమించడం, అంబటి రాయుడికి జట్టులో చోటు దక్కకపోవడం లాంటి పరిణామాలతో… కోహ్లీ కెప్టెన్సీపై, సెలెక్షన్ కమిటీపై భారత క్రికెట్ మాజీలు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. సెలెక్టర్లకు ముందు చూపు లేదనే కామెంట్లు కూడా వచ్చాయి. ఈ ఆరోపణల పట్ల సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించారు.

సెలక్షన్ కమిటీకి విజన్ లేదని విమర్శిస్తున్నారు… మాకు విజన్ లేకపోతే.. పరిమిత ఓవర్ల క్రికెటర్ అయిన బుమ్రా టెస్టుల్లోకి ఎలా వచ్చాడు. నంబర్ వన్ టెస్టు బౌలర్‌గా ఎలా రూపొందాడు? అందరూ టీ20 ప్లేయర్‌గా భావించే హార్దిక్ పాండ్య.. మూడు ఫార్మాట్లలోనూ ఆల్‌రౌండర్‌గా ఎలా మారాడు? అశ్విన్, జడేజా లాంటి స్పిన్నర్లు ఉండగా.. పరిమిత ఓవర్ల క్రికెట్లో కుల్దీప్, చాహల్ జోడీ ఎలా సత్తా చాటుతోంది? అని ఎమ్మెస్కే ప్రసాద్ ప్రశ్నించారు. రిషబ్ పంత్‌ను టెస్టు క్రికెట్ ఎలా ఆడించామన్న చీఫ్ సెలెక్టర్.. మయాంక్ అగర్వాల్, హనుమ విహారీ లాంటి ఆటగాళ్లు ఎలా రాణిస్తున్నారో చూడండన్నారు. ఖలీల్ అహ్మద్, నవదీప్ సైనీలు ప్రస్తుతం దేశంలో ఉన్న ఇద్దరు ఫాస్టెస్ట్ బౌలర్లని చెప్పారు. ఇంత మంది ఆటగాళ్లను స్టాండ్ బై‌గా తీర్చిదిద్దామనేలా ఆయన వ్యాఖ్యలు చేశారు.