Hockey World Cup 2023: అట్టహసంగా హాకీ ప్రపంచకప్ ప్రారంభ వేడుక.. రేపటి నుంచి హాకీ అభిమానులకు పండుగ..

|

Jan 12, 2023 | 4:59 AM

హాకీ ప్రపంచ కప్‌కు ఒడిశా రెడీ అయింది. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభ వేడుక కటక్‌లోని బరాబరీ స్టేడియంలో అద్భుతంగా జరిగింది. ఈ వేడుకలో స్థానిక కళాకారులు, బాలీవుడ్ నటులు సందడి చేశారు. చాలా కాలం నిరీక్షణ తర్వాత..

Hockey World Cup 2023: అట్టహసంగా హాకీ ప్రపంచకప్ ప్రారంభ వేడుక.. రేపటి నుంచి హాకీ అభిమానులకు పండుగ..
Hockey World Cup Inauguration Ceremony
Follow us on

హాకీ ప్రపంచ కప్‌కు ఒడిశా రెడీ అయింది. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభ వేడుక కటక్‌లోని బరాబరీ స్టేడియంలో అద్భుతంగా జరిగింది. ఈ వేడుకలో స్థానిక కళాకారులు, బాలీవుడ్ నటులు సందడి చేశారు. చాలా కాలం నిరీక్షణ తర్వాత, పురుషుల హాకీ ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. జనవరి 13 నుంచి ఒడిశాలో ప్రపంచంలోని అత్యుత్తమ 16 జట్లు ఈటోర్నమెంట్‌లో తలపడనున్నాయి. ఈ పోటీ ప్రారంభానికి రెండు రోజుల ముందు, ఇంటర్నేషనల్‌ హాకీ ఫెడరేషన్‌- ఎఫ్‌ఐహెచ్ ప్రపంచ కప్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. జనవరి 11 బుధవారం జరిగిన ప్రారంభ వేడుకలకు టోర్నమెంట్‌లో పాల్గొనే 16 జట్లను స్వాగతించడానికి కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఎఫ్‌ఐహెచ్ ప్రెసిడెంట్ టైబ్ ఇక్రమ్, హాకీ ఇండియా ప్రెసిడెంట్ దిలీప్ టిర్కీ హాజరయ్యారు. ఈ ప్రారంభ వేడుకల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ప్రముఖ నృత్య గురువు అరుణా మొహంతి కొరియోగ్రఫీ చేసిన కనీసం ఆరు స్థానిక నృత్య రూపాల కలయికతో కూడిన రాష్ట్ర గిరిజన నృత్య రూపంతో వేడుకలు ప్రారంభమయ్యాయి.

ఈ కార్యక్రమంలో బాలీవుడ్ గాయకులు, స్థానిక కళాకారులు సంగీత దర్శకుడు ప్రీతమ్ కంపోజ్ చేసిన హాకీ వరల్డ్ కప్ థీమ్ సాంగ్‌ను పాడారు, వీరు కొంతమంది ఇతర గాయకులతో కలిసి వేదికపై అద్భుత ప్రదర్శన చేశారు. మరోవైపు బాలీవుడ్ సూపర్ స్టార్ రణవీర్ సింగ్ కూడా తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు.

జనవరి 13 నుంచి 29 వరకు రూర్కెలాలోని బిర్సా ముండా హాకీ స్టేడియం, భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం వేదికలుగా మ్యాచ్‌లు జరగనున్నాయి. రూర్కెలాలో 20 మ్యాచ్‌లు, ఫైనల్‌తో సహా 24 మ్యాచ్‌లు భువనేశ్వర్‌లో జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..