భారత వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ వికెట్ కీపర్ అవతారమెత్తాడు. అదేంటి అతను ఆఫ్ స్పిన్నర్ కదా.. అని ఆశ్చర్యపోతున్నారా? అయితే అతను వికెట్ కీపింగ్ చేసింది అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో కాదు.. ఓ గల్లీ క్రికెట్ మ్యాచ్‌లో. అంతర్జాతీయ క్రికెట్‌లో తన ఆఫ్‌స్పిన్‌తో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన టర్బోనేటర్ తాజాగా గల్లీ క్రికెట్ ఆడారు. తన ఇంటికి సమీపంలో కొంతమంది పిల్లలతో సరదాగా కలిసి పోయి సరదాగా ఈ గేమ్ ఆడాడు. అయితే ఇందులో అతను బౌలర్‌గా కాకుండా వికెట్ కీపర్ అవతారం ఎత్తాడు. చక్కగా వికెట్ కీపింగ్ చేయడమే కాకుండా ఒక క్యాచ్ కూడా అందుకున్నాడు. ఆ వెంటనే పిల్లలతో కలిసి ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు.
కమ్రాన్ అక్మల్ కంటే బాగా కీపింగ్ చేస్తున్నావ్..
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫొటోలు, వీడియోలు పంచుకునే భజ్జీ… తన గల్లీ క్రికెట్ వీడియోను కూడా షేర్ చేశాడు. ‘గల్లీ క్రికెట్ విత్ కామెంటరీ’ అని పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియోలో మరో విశేషమేమిటంటే భారత మాజీ టెస్ట్ క్రికెటర్ ఆకాశ్ చోప్రా దీనికి కామెంటరీ చెప్పడం. నెటిజన్లు కూడా ఈ వీడియోపై లైకుల వర్షం కురిపిస్తున్నారు. ‘వావ్ పాజీ’, ‘సింగ్ ఈజ్ కింగ్’, ‘కమ్రాన్ అక్మల్ (పాకిస్తాన్ వికెట్ కీపర్) కంటే బాగా కీపింగ్ చేస్తున్నావ్’ అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Martin Guptill: అశ్విన్ బౌలింగ్ ఎదుర్కొవడం కష్టం.. అతడు వేసే బంతులు వైవిధ్యంగా ఉంటాయి..