FIFA World Cup: ఒకరోజు ముందుగానే ఫిఫా వరల్డ్ కప్.. ఎందుకో కారణం తెలుసా..

|

Aug 12, 2022 | 1:54 PM

భారత్ లో క్రికెట్ కు ఎక్కువమంది ప్రేమికులు ఉంటే.. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది క్రీడాభిమానులు ఆదరించే ఆట ఫుట్ బాల్.. నాలుగేళ్లకోసారి జరిగే వరల్డ్‌కప్‌కు

FIFA World Cup: ఒకరోజు ముందుగానే ఫిఫా వరల్డ్ కప్.. ఎందుకో కారణం తెలుసా..
Fifa
Follow us on

FIFA World Cup: భారత్ లో క్రికెట్ కు ఎక్కువమంది ప్రేమికులు ఉంటే.. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది క్రీడాభిమానులు ఆదరించే ఆట ఫుట్ బాల్.. నాలుగేళ్లకోసారి జరిగే వరల్డ్‌కప్‌కు ఈఏడాది ఖతార ఆతిథ్యమిస్తోంది. అయితే ఈ వరల్డ్‌కప్‌ ముందు ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది నవంబర్‌ 21న ప్రారంభం కావాల్సి ఉంది. ఫిఫా తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఒక రోజు ముందుగానే అంటే నవంబర్‌ 20నే ఈఫుట్ బాల్ ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈవిషయాన్ని ఫిఫా అదికారికంగా వెల్లడించింది.

తొలిరోజు అతిథ్య ఖతార్, ఈక్వెడార్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే 21వ తేదీ సోమవారం వస్తుంది. అది వర్కింగ్ డే.. అందుకే హాలీడే రోజైన ఆదివారం సాయంత్రం స్లాట్ ను ఈమ్యాచ్ కు కేటాయించారు. దీంతో ఒకరోజు ముందే ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈనిర్ణయం కారణంగా వరల్డ్‌కప్‌ 28 రోజులకు బదులుగా 29 రోజులు జరగనుంది. నిజానికి ఈ టోర్నీ జూన్‌-జులైలోనే జరగాల్సి ఉన్నా.. ఖతార్‌లో ఎండాకాలం కారణంగా ఈటోర్నమెంట్ ను నవంబర్‌, డిసెంబర్‌లకు వాయిదా వేశారు. ఫిఫా కమిటీలోని సభ్యులైన ఛైర్మన్ గియానీ ఇన్ఫాంటినో, ఇతర ఆరు ఖండాల సాకర్‌ సంఘాల అధ్యక్షులు సమావేశమై ఒక రోజు ముందే టోర్నీ ప్రారంభించాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు ఫిఫా వెల్లడించింది. ఈ నిర్ణయం కారణంగా ఏవైనా సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరిస్తామని స్పష్టం చేసింది. ఫిఫా తీసుకున్న ఈ నిర్ణయంపై అతిథ్య ఖతార్‌ ఆనందం వ్యక్తం చేసింది. ఖతార్‌ వరల్డ్‌కప్‌లో ఆడటం ఇదే తొలిసారి కాగా.. ఆతిథ్య జట్టు హోదాలో నవంబర్ 20వ తేదీన తొలి మ్యాచ్ ఆడనుంది.

ఇవి కూడా చదవండి

ఇదికూడా చదవండి: టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు