AIFF: ఆలిండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ పై ఇటీవల ఫిఫా విధించిన నిషేధం త్వరలో ఎత్తివేయనున్నట్లు తెలుస్తోంది. పలు నిబంధనలను ఆలిండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ పాటించడం లేదని నిషేధం విధించగా.. దీనిపై కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ తగు చర్యలు చేపట్టినట్లు సమాచారం. దీంతో ఫిఫా విధించిన నిషేధం త్వరలో ఎత్తివేసే అవకాశం ఉన్నట్లు .. దీనికి సంబంధిచిన ప్రకటన రానున్నట్లు సమాచారం. ఈఏడాది అక్టోబర్ లో దేశంలో మహిళల అండర్ -17 ఫుట్ బాట్ ప్రపంచ కప్ హోస్టింగ్ హక్కులను కూడా తొలగించింది.
భారత ఫుట్బాల్ ఫెడరేషన్ లో బయటి వ్యక్తుల జోక్యం ఎక్కువగా ఉన్నట్లు చెబుతూ ఫిఫా నిషేధం విధించింది. నిబంధనలు పాటించలేని అసోసియేషన్లను తాము గుర్తించలేమని స్ఫష్టం చేసింది. ఫిఫా చట్టాలను ఉల్లఘించినందుకే ఆలిండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ పై చర్యలు తీసుకున్నట్లు వివరించింది. భారత ఫుట్బాల్ సమాఖ్య సస్పెన్షన్పై ఫిఫా కౌన్సిల్ బ్యూరో ఈనెలలో ఏకగ్రీవ తీర్మానం చేసింది. భారత ఫుట్బాల్ ఫెడరేషన్కు పూర్తి స్థాయి కార్యవర్గం లేదు. కేవలం ముగ్గురు సభ్యులతో కూడిన ఎగ్జిక్యూటివ్ కమిటీ కార్యకలాపాలను సాగిస్తోంది. దీంతో ఫిఫాలో బయటి వ్యక్తుల జోక్యం ఎక్కువైంది. ఈ విషయంపై భారత్ను ఫిఫా పలుమార్లు హెచ్చరించింది. అయినా భారత సమాఖ్య పట్టించుకోలేదు. దీంతో ఫిఫా నిషేధం విధించింది. ఫిఫా నిర్ణయంతో ముగ్గురు సభ్యుల AIFF ఎగ్జిక్యూటివ్ కమిటీ అధికారాలు పూర్తిగా రద్దు అయ్యాయి. AIFFపై పాలక మండలి తిరిగి నియంత్రణ పొందేందుకు నిర్వాహకుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించింది. ఫిఫా చట్టాల ప్రకారం ప్రతి ఫుట్బాల్ ఫెడరేషన్ 12 నుంచి 15 మందితో కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలి. కానీ ఆలిండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ మాత్రం ముగ్గురితోనే కార్యవర్గ కమిటీని నడిపిస్తోంది. దీంతోనే ఈనిషేధం విధించింది. ప్రస్తుతం ఫిఫా నిబంధనల ప్రకారం పూర్తిస్థాయి కమిటీని నియమించేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇదే అంశంపై ముగ్గురు సభ్యులతో కూడిన ఎగ్జిక్యూటివ్ కమిటీని రద్దు చేయాలని న్యాయస్థానానికి విన్నవించింది. ఈపరిణామాల నేపథ్యంలో పూర్తిస్థాయి కమిటీని ఏర్పాటుచేస్తే ఫిఫా విధించిన నిషేధాన్ని ఎత్తివేసే అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..