Faf du Plessis: ఆసుపత్రిలో సౌతాఫ్రికా స్టార్ ప్లేయ‌ర్‌.. ఫీల్డింగ్‌లో తలకు గాయం.. వీడియో..

|

Jun 13, 2021 | 1:27 PM

Pakistan Super League: క్రికెట్ మైదానంలో మ‌రో క్రికెట్ ప్లేయ‌ర్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ఫీల్డింగ్ చేస్తూ మ‌రో ప్లేయ‌ర్‌ను ఢీకొట్టిన సౌతాఫ్రికా బ్యాట్స్‌మ‌న్

Faf du Plessis: ఆసుపత్రిలో సౌతాఫ్రికా స్టార్ ప్లేయ‌ర్‌.. ఫీల్డింగ్‌లో తలకు గాయం.. వీడియో..
Faf Du Plessis
Follow us on

Pakistan Super League: క్రికెట్ మైదానంలో మ‌రో క్రికెట్ ప్లేయ‌ర్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ఫీల్డింగ్ చేస్తూ మ‌రో ప్లేయ‌ర్‌ను ఢీకొట్టిన సౌతాఫ్రికా బ్యాట్స్‌మ‌న్ ఫఫ్ డుప్లెస్సిస్‌ ని వెంట‌నే ఆసుపత్రికి తరలించారు. పాకిస్థాన్ సూప‌ర్ లీగ్ (పీఎస్ఎల్‌)లో భాగంగా క్వెట్టా గ్లాడియేట‌ర్స్ టీమ్ త‌ర‌ఫున ఆడుతున్న డుప్లెస్సి.. లాంగాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. శనివారం ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. పెషావ‌ర్ జాల్మీ ప్లేయ‌ర్ డేవిడ్ మిల్ల‌ర్ కొట్టిన షాట్‌తో బంతి.. లాంగాన్ బౌండ‌రీ వైపు దూసుకెళ్ల‌గా డుప్లెస్సి డైవ్ చేశాడు. సరిగ్గా అదే స‌మ‌యంలో లాంగాఫ్ నుంచి మ‌రో ప్లేయ‌ర్ మ‌హ్మ‌ద్ హ‌స్నైన్ దూసుకొచ్చాడు. ఈ క్ర‌మంలో అత‌ని మోకాలు డుప్లెస్సి త‌ల‌కు బలవంతంగా త‌గిలింది. దీంతో ఫఫ్ డుప్లెస్సిస్ కుప్ప‌కూలాడు.

ఆ వెంట‌నే మైదానం నుంచి అతన్ని హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లిన‌ట్లు టీమ్ వెల్ల‌డించింది. అక్క‌డ అత‌నికి పరీక్షలు చేశారు. ఆ తర్వాత డుప్లెస్సిస్ మ్యాచ్ ఆడ‌లేదు. దీంతో క్వెట్టా గ్లాడియేట‌ర్స్ 198 ప‌రుగుల టార్గెట్‌ను ఛేదించ‌లేక 61 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. మ‌రో స్టార్ బ్యాట్స్‌మ‌న్ ఆండ్రీ ర‌సెల్ కూడా లేక‌పోవ‌డం క్వెట్టా టీమ్‌ను భారీగా దెబ్బ‌తీసింది. అయితే మోకాలు బలంగా తాకడంతో కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు డుప్లెస్సీస్‌కు సూచించినట్లు చెబుతున్నారు.

Also Read:

MS Dhoni: చిన్ని గుర్రంతో ఆటలాడిన ధోని.. నెట్టింట వీడియో వైరల్..

French Open 2021:ప్రెంచ్ ఓపెన్ మహిళా సింగిల్స్ లో సంచలనం .. టైటిల్ విజేతగా నిలిచిన 33వ సీడెడ్ బార్బొరా క్రెజికోవా