WTC Final 2021: మరికొద్ది రోజుల్లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్(ఢబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్ జరుగనుండటంతో అందరి దృష్టి ఇప్పుడు దానిపై పడింది. ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ క్రికెట్ స్టేడియం వేదికగా జూన్ 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు, న్యూజిలాంట్ టీమ్ తలబడనున్నాయి. మ్యాచ్‌కు ఇంకా మరికొన్ని రోజులు మాత్రమే ఉండటంతో.. ఇరు జట్ల బలాబలాలపై విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఈ మ్యాచ్‌కు సంబంధించి స్పోర్ట్స్ ఛానెల్స్‌లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
ఇదిలాఉంటే.. తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానెల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో ఆస్ట్రేలియా క్రికెట్ మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్.. టీమిండియా ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇంగ్లండ్-భారత్ మధ్య జరగనున్న ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో రవిచంద్రన్ అశ్విన్ పేరు ఖరారైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అశ్విన్ బౌలింగ్‌పై స్పందించిన చాపెల్.. కీలక వ్యాఖ్యలు చేశారు. నాథన్ లియాన్ కంటే అశ్విన్ మంచి బౌలర్ అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నాడంటూ కితాబిచ్చాడు. ఇదిలాఉంటే.. ఇదే ప్రోగ్రాంలో వ్యాఖ్యాతగా పాల్గొన్న సంజయ్ మంజ్రేకర్.. అశ్విన్ ఆల్ టైమ్ గ్రేట్ బౌలర్లలో ఒకరిగా పరిగణించబడుతున్న నేపథ్యంలో అతను కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.
Also read:
Tungnath Temple: ఓ వైపు మందాకిని మరోవైపు అలకనందానది మధ్యలో చంద్రశిలపై ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం