ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ మరో పరాజయాన్ని తప్పించుకుంది. ఆసీస్‌తో సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ అద్భుత పోరాటపటిమచూపి మ్యాచ్‌ను డ్రా చేసుకోగలిగింది. ఆఖరి బంతి వరకు ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టెయిలెండర్లు పట్టుదలతో క్రీజ్‌లో నిలిచారు. ఇంగ్లండ్ స్టార్ పేసర్లు స్టువర్ట్ బ్రాడ్ (35 బంతుల్లో 8 నాటౌట్), జేమ్స్ అండర్సన్ (6 బంతుల్లో 0 నాటౌట్)లు వికెట్లకు అడ్డుగా నిల్చోని తమ జట్టును వైట్‌వాష్ గండం నుంచి తప్పించారు. కాగా 358 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు 30 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు మరోసారి పేలవమైన ఆటతీరును ప్రదర్శించింది. ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో పర్యాటక ఆటగాళ్లు క్రీజ్‌లో నిలవలేకపోయారు. ఓపెనర్ హసీబ్ హమీద్ (9) తన పేలవఫామ్‌ను కొనసాగించగా.. డేవిడ్ మలాన్ (4), జో రూట్ (24) వెంటవెంటనే అవుటయ్యారు. అయితే ఆతర్వాత బెన్ స్టోక్స్ (123 బంతుల్లో 60), బెయిర్ స్టో (105 బంతుల్లో 41)లు ఆతిథ్య జట్టు బౌలర్లకు ఎదురొడ్డి నిలిచారు.
ఆఖర్లో ఉత్కంఠ..
కానీ ఆఖరు సెషన్లో ఆసీస్ బౌలర్లు మరోసారి చెలరేగారు. దీంతో ఇంగ్లండ్ మిడిలార్డర్ చేతులెత్తేసింది. బెయిర్ స్టో, జాక్ లీచ్ (34 బంతుల్లో 26)లు కాసేపు పోరాడాడు. అయితే 270 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొమ్మిదో వికెట్‌ను కోల్పోవడంతో అసలు మజా మొదలైంది. అప్పటికి ఆటలో కేవలం ఒక్క ఓవర్ మాత్రమే మిగిలుంది. ఆసీస్ విజయానికి ఒక వికెట్ కావాలి. ఈ సమయంలో బ్రాడ్, అండర్సన్‌లు పట్టుదలతో ఆడారు. స్మిత్ వేసిన ఆఖరి ఓవర్ లో అండర్సన్ వికెట్లకు అడ్డుగా నిలబడడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. కాగా ఆసీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 416/8 పరుగులు చేయగా ఇంగ్లండ్ 294 పరుగులకు ఆలౌటౌంది. ఇక ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 265/6 రన్స్ చేసి పర్యాటక జట్టుకు 358 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. చాలాకాలం తర్వాత జట్టులోకి వచ్చి రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలు బాదిన ఉస్మాన్ ఖ్వాజాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. కాగా ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను ఇదివరకే 3-0తో కైవసం చేసుకుంది ఆసీస్.
Courage and fight ???
A brilliant Test match ends in a draw.
Scorecard: https://t.co/zUe2PThJeA#Ashes | ?? #AUSvENG ?? pic.twitter.com/FdIjaFRgOL
— England Cricket (@englandcricket) January 9, 2022
Also Read:
Coronavirus: మాస్క్ వల్లే నా ముఖం ఇలా అయింది.. నాకు మాత్రం తప్పదు..
Ramesh Babu: కన్నీరు పెట్టిస్తోన్న మహేష్ పోస్ట్.. అన్నయ్యా..నాకు అన్నీ నీవేనంటూ..
మీరు జీతం తీసుకునే వ్యక్తులైతే కచ్చితంగా ఈ 5 విషయాలు తెలుసుకోండి.. లేదంటే అన్ని సమస్యలే..?