Virat Kohli Captaincy: చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ పరాజయానికి కెప్టెన్ విరాట్ కోహ్లీనే బాధ్యుడు అని పలువురు మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కోహ్లీ కెప్టెన్సీలో ఇది వరుసగా నాలుగో ఓటమి కావడంతో.. అతని కెప్టెన్సీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ తరుణంలో ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మాంటీ పనేసర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
మొదటి టెస్టు మాదిరిగానే రెండో మ్యాచ్‌లో కూడా టీమిండియా ఓటమిపాలైతే.. కెప్టెన్‌గా కోహ్లీ కెరీర్ ముగిసినట్లేనని పనేసర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ గైర్హాజరీలోనే(ఆసీస్ పర్యటన) టీమిండియాను అప్పటి తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహనే సమర్ధవంతంగా ముందుండి నడిపించాడు. ఈ క్రమంలోనే రహనేను టెస్టు కెప్టెన్‌గా నియమించాలని డిమాండ్లు పెరిగాయి. ఈ తరుణంలో తాజాగా పనేసర్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.
కోహ్లీ నిజంగానే గొప్ప బ్యాట్స్‌మెన్.. కానీ అతడి సారధ్యంలోనే టీమిండియా దారుణ వైఫల్యాలను ఎదుర్కుంది. దీనికి కోహ్లీనే బాధ్యత వహించాలి. అటు కెప్టెన్‌గా రహనే సక్సెస్ కావడం కోహ్లీపై ఒత్తిడి పెంచుతోందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా అటు తొలి టెస్టులో కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడంపై పనేసర్ తప్పుబట్టాడు.
Viral Video: చావు దారిదాపుల్లోకి వెళ్లొచ్చాడు.. 70 అడుగుల ఎత్తు నుంచి పడి ప్రాణాలతో తిరిగొచ్చాడు..
12 ఏళ్ల బుడతడు.. స్టాక్ మార్కెట్‌లో ఏకంగా రూ. 16 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు.. ఆ తర్వాత ఏమైందంటే.!
ఫస్ట్ నైట్ రోజు భార్యను పట్టించుకోకుండా.. కంప్యూటర్‌తో.. నెట్టింట్లో రచ్చ.. రచ్చ..