Telugu News Sports News CWG 2022 Harjinder Kaur wins bronze medal in 71 kg weightlifting Telugu Sports News
CWG 2022 Weightlifting: పతకాల పంట పండిస్తోన్న భారత వెయిట్ లిఫ్టర్లు .. 71 కిలోల విభాగంలో హర్జిందర్ కౌర్‌కు కాంస్యం
Commonwealth Games 2022: బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్- 2022 లో భారత వెయిట్‌లిఫ్టర్లు తమ అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తున్నారు. దేశానికి పతకాల పంట పండిస్తున్నారు. తాజాగా మహిళల 71 కిలోల విభాగంలో హర్జిందర్ కౌర్
Commonwealth Games 2022: బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్- 2022 లో భారత వెయిట్‌లిఫ్టర్లు తమ అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తున్నారు. దేశానికి పతకాల పంట పండిస్తున్నారు. తాజాగా మహిళల 71 కిలోల విభాగంలో హర్జిందర్ కౌర్ (Harjinder Kaur) కాంస్య పతకం సాధించింది. స్నాచ్‌లో 93 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 119 కిలోలు, మొత్తం మీద 212 కిలోలు ఎత్తిన ఆమె మూడో స్థానంలో నిలిచింది. తద్వారా భారత్ ఖాతాలో మరో పతకాన్ని చేర్చింది. ఇంగ్లండ్‌కు చెందిన సారా డేవిస్ మొత్తం 229 కిలోల బరువు ఎత్తి స్వర్ణం సొంతం చేసుకోగా, కెనడాకు చెందిన అలెక్సిస్ అష్‌వర్త్ 214 కిలోల బరువుతో రజతం గెల్చుకుంది. కాగా వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్ ఇప్పటి వరకు 3 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు సాధించింది. ఈ ఈవెంట్‌లో మరే దేశమూ ఇన్ని మెడల్స్ గెల్చుకోలేదు.
కాగా ఈవెంట్ ప్రారంభంలో హర్జిందర్ ప్రారంభంలో బాగా ఇబ్బంది పడింది. స్నాచ్‌లో 90 కిలోల మొదటి ప్రయత్నంలో విఫలమైంది. అయితే చివరి ప్రయత్నంలో 93 కిలోలు ఎత్తి మళ్లీ పోటీలోకి వచ్చింది . క్లీన్ అండ్ జెర్క్‌లో ఆమె చేసిన మూడు ప్రయత్నాలూ విజయవంతమయ్యాయి. 113 కిలోలతో ప్రారంభించి అత్యధికంగా 119 కిలోల బరువును ఎత్తి 212 కిలోలకు చేరుకుంది. తద్వారా భారత్ ఖాతాలో కాంస్య పతకాన్ని చేర్చింది. ఇక మొత్తం పతకాల విషయానికొస్తే.. 3 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలతో భారత్ పతకాల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.