IPL 2021: ఐపీఎల్‌లో నంబర్ వన్ స్థానం కోసం సోమవారం ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్ టీంలు తలపడ్డాయి. అయితే మ్యాచ్ సందర్భంగా మహేంద్ర సింగ్ ధోని కుమార్తె జివా తన తండ్రి జట్టు విజయం కోసం ప్రార్థిస్తున్న ఓ ఫొటో నెట్టింట్లో వైరల్ల్గా మారింది. తన తల్లి సాక్షితో కలిసి దుబయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో కూర్చున్న జివా, చెన్నై సూపర్ కింగ్స్ నిర్ధేశించిన 137 పరుగుల తక్కువ లక్ష్యాన్ని చేధిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు 3 ఓవర్లలో 28 పరుగులు అవసరమయ్యాయి. దీంతో జివా తండ్రికి అనుకూలంగా ఫలితం రావాలంటూ ప్రార్థిస్తున్నట్లు ఫొటోలో చూడొచ్చు. దీంతో జివా అమాయకత్వానికి క్రికెట్ అభిమానులను ఫిదా అవుతున్నారు. ఈ అందమైన ఫొటోను షేర్ చేస్తూ తెగ సంబరపడిపోతున్నారు.
చివరికి, షిమ్రాన్ హెట్మైర్ తుఫాన్ బ్యాటింగ్ కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచులో గెలిచి పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ టీం అగ్రస్థానానికి చేరుకుంది. ధోని సేన రెండో స్థానంలో నిలిచింది. 137 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు ఫృధ్వీషా, శిఖర్ ధావన్ మంచి ప్రారంభాన్ని ఇచ్చారు. ఫృధ్వీషా 18 పరుగులు చేసి ఔటైనా శిఖర్ ధావన్ నిలకడగా ఆడి స్కోరు బోర్డును పరుగెత్తించాడు. 39 పరుగులు (2 సిక్స్‌లు, 3 ఫోర్లు) చేసి ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. అయితే చివరలో చెన్నై బౌలర్లు చెలరేగిపోయారు. వరుసగా వికెట్లు సాధించారు. దీంతో ఢిల్లీ ఓడిపోతుందని అనుకున్నారు. కానీ క్రీజులోకి వచ్చిన షిమ్రాన్ హెమ్మీర్ 18 బంతుల్లో 28 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
Ziva is praying for csk
One of cutest moment in whole IPL 2021#ipl2021 #cskvsdc pic.twitter.com/ufuitczBUE— CRICKET home (@Cricrush1) October 4, 2021
So cute ❤ #ziva is praying for win pic.twitter.com/AIvBlHXv4e
— SO??? (@beinghonest_x) October 4, 2021
Also Read: T20 World Cup, IND vs PAK: భారత్ అంత బలంగా లేదు.. ఈ సారి పాకిస్తాన్‌దే విజయం: పాక్ మాజీ ప్లేయర్