ICC World Cup Qualifiers 2023: హరారేలో జరిగిన వన్డే ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో జింబాబ్వే అద్భుతమైన ప్రదర్శనతో కొత్త రికార్డును నెలకొల్పింది. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే కెప్టెన్ సీన్ విలియమ్స్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో దడదడలాడించాడు. ఈ మ్యాచ్ లో ఓపెనర్లుగా రంగంలోకి దిగిన జాయ్ లార్డ్ గుంబి (78), ఇన్నోసెంట్ (32) జింబాబ్వే జట్టుకు శుభారంభం అందించారు. ఆ తర్వాత మూడో నంబర్‌లో బరిలోకి దిగిన విలియమ్స్ తుఫాన్ బ్యాటింగ్‌తో దుమ్మరేపాడు.
మైదానం అంతటా సిక్సుల-ఫోర్ల వర్షం కురిపించిన సీన్ విలియమ్స్.. కేవలం 65 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. 101 బంతుల్లో 21 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 174 పరుగులు చేశాడు. ఫలితంగా జింబాబ్వే జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 408 పరుగులు చేసింది. 409 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా జట్టు 104 పరుగులకే ఆలౌటైంది. దీంతో జింబాబ్వే జట్టు 304 పరుగులతో రికార్డు సృష్టించింది.
విశేషమేమిటంటే వన్డే క్రికెట్‌లో జింబాబ్వే నమోదైన అత్యధిక స్కోరు ఇదే. అలాగే, వన్డే క్రికెట్‌లో 400కు పైగా పరుగులు చేసిన 7వ జట్టుగా నిలిచింది. ముఖ్యంగా వన్డే క్రికెట్ లో మొత్తం 953 మ్యాచ్ లు ఆడిన పాకిస్థాన్ జట్టు ఇప్పటి వరకు 400 పరుగులు చేయలేదు. అంతకుముందు జింబాబ్వేపై పాకిస్థాన్ అత్యధిక స్కోరు 399 పరుగులు.
ఇప్పుడు పాకిస్థాన్ జట్టుకు సాధ్యం కానిది జింబాబ్వే జట్టు సాధించింది. ముఖ్యంగా 2015లో పాక్ జట్టు చేసిన 399 పరుగుల రికార్డును జింబాబ్వే అధిగమించి సరికొత్త చరిత్ర సృష్టించడం విశేషం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..