Yuzvendra Chahal: 15వ అంతస్తు నుంచి నన్ను వేలాడదీశాడు.. భయంకర నిజాన్ని బయట పెట్టిన చాహల్..

లెగ్‌ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్(Yuzvendra Chahal) తను ముంబై ఇండియన్స్‌కు ఆడిన రోజుల్లో జరిగిన రెండు భయానక సంఘటనలను వివరించాడు...

Yuzvendra Chahal: 15వ అంతస్తు నుంచి నన్ను వేలాడదీశాడు.. భయంకర నిజాన్ని బయట పెట్టిన చాహల్..
Chahal
Follow us

|

Updated on: Apr 08, 2022 | 1:22 PM

లెగ్‌ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్(Yuzvendra Chahal) తను ముంబై ఇండియన్స్‌కు ఆడిన రోజుల్లో జరిగిన రెండు భయానక సంఘటనలను వివరించాడు. ఇంతవరకూ ఎవరికీ తెలియని ఆ సంఘటనను రవిచంద్రన్‌ అశ్విన్‌(Ravichandran) ఇంటర్వ్యూలో వెల్లడించాడు. మొదటి ఎపిసోడ్ ఆస్ట్రేలియన్లు ఆండ్రూ సైమండ్స్, జేమ్స్ ఫ్రాంక్లిన్ సంబంధించిన ఘటన కాగా.. రెండోది సహచరుడి 15వ అంతస్తు నుంచి సహచరుడిని వేలాడదీసిన ఘటన. సైమండ్స్(symonds)-ఫ్రాంక్లిన్ ఎపిసోడ్ 2011 నాటిదని చాహల్ చెప్పాడు. “ఇది 2011లో చెన్నై హోటల్‌లో ఛాంపియన్స్ లీగ్ గెలిచిన తర్వాత ఆండ్రూ సైమండ్స్ “పండ్ల రసం” తాగాడు. నేను అతనితో ఉన్నాను. జేమ్స్ ఫ్రాంక్లిన్, సైమండ్స్ నా చేతులు కాళ్లను కట్టివేసి నోటికి టేప్ వేశారు. ఆ తర్వతా నా గురించి మరచిపోయారు. పార్టీ పూర్తయింది. ఉదయం ఒక క్లీనర్ వచ్చి నన్ను విడిపించాడు.” చాహల్ చెప్పాడు.

“రెండోది 2013లో నేను ముంబయి తరఫున ఆడినప్పుడు జరిగింది. బెంగళూరులో మేం ఒక మ్యాచ్‌ గెలిచాక పార్టీ చేసుకున్నాం. ఆ సమయంలో ఒక క్రికెటర్‌ తాగిన మైకంలో ఉన్నాడు. నన్ను చాలాసేపు గమనించి తనవద్దకు రమ్మని పిలిచాడు. అతడి వద్దకు వెళ్లగానే నన్ను ఎత్తుకొని బాల్కనీలో 15వ అంతస్తులో వేలాడదీశాడు. అప్పుడు నా చేతులతో అతడి మెడను గట్టిగా పట్టుకున్నా. ఏ మాత్రం పట్టు సడలినా నా పని అయిపోయేది. వెంటనే అక్కడున్న వారు స్పందించడంతో బతికిపోయా” అని రాహుల్ వివరించాడు.

“RCBతో ఉన్న సమయంలో నేను పూర్తిగా నిరాశకు గురయ్యాను. ఆ సీజన్‌లో నేను ఏ మ్యాచ్‌నూ బాగా ఆడలేదు. ఆ ఐపీఎల్‌లో నేను ముంబై ఇండియన్స్‌పై మాత్రమే రాణించాను.” అని చెప్పాడు. 2018లో బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ షోలో చాహల్ సైమండ్స్‌తో తనకున్న స్నేహం గురించి వివరించాడు. “నేను ఆస్ట్రేలియాకు వెళ్లినప్పుడల్లా, అతనితో కలిసి చేపలు పట్టడం నాకు చాలా ఇష్టం. అతను గొప్ప హోస్ట్. అతని భార్య ఇంటర్నెట్‌లో వంటకాలను అనుసరించడం ద్వారా నా కోసం బటర్ చికెన్ ఎలా ఉడికించాలో కూడా నేర్చుకుంది. నేను వారిని కలవడానికి అక్కడికి వెళ్లినప్పుడు, నా కోసం బటర్ చికెన్ సిద్ధంగా ఉంటుంది ”అని చాహల్ చెప్పాడు.

Read Also.. IPL 2022: ఓటమితో పాటు రూ.12 లక్షలు నష్టపోయిన రిషబ్ పంత్.. ఎందుకో తెలుసా..