Yuzvendra Chahal -Dhanashree Verma: టీమిండియా స్పిన్నర్ యుజువేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ మధ్య విభేదాలు తలెత్తాయని, త్వరలో విడాకులు తీసుకుంటున్నట్లు ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. అయితే అవన్నీ వదంతులేనని.. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మవద్దంటూ ఇద్దరూ తమ రిలేషన్‌షిప్‌పై క్లారిటీ ఇచ్చారు. దయచేసి ఇలాంటి రూమర్లకు ముగింపు పలకాలంటూ చాహల్ వేడుకున్నాడు. అలాగే ధనశ్రీ కూడా స్పందిస్తూ.. ఇలాంటి పుకార్లు తమను కలచివేస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఈ జంట ఇన్‌స్టాలో మరో వీడియోను పోస్ట్ చేసింది. తద్వారా తమ బంధంపై వస్తున్న రూమర్లకు మరోసారి చెక్‌పెట్టే ప్రయత్నం చేశారు. ఇందులో చాహల్ మొదట ముభావంగా ఉంటాడు. అయితే తాను నెల రోజుల పాటు పుట్టింటికీ వెళతాను అని ధనశ్రీ చెప్పగానే.. యుజీ సంతోషంతో డ్యాన్స్ చేస్తాడు. అతని నృత్యం చేసి ధనశ్రీ కూడా చిరునవ్వులు చిందిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టంట వైరల్‌గా మారింది. మిలియన్ల మంది ఈ వీడియోను వీక్షించగా.. లక్షలాది లైకులు వచ్చాయి. ‘లవ్లీ కపుల్, క్యూట్ కపుల్’ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
కాగా కాగా యుజువేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ 2020 డిసెంబర్20న పెళ్లిపీటలెక్కారు. చాహల్ టీమిండియాలో స్పిన్నర్‌గా రాణిస్తోంటే.. ధనశ్రీ ఫేమస్ యూట్యూబర్‌గా, కొరియోగ్రాఫర్‌గా రాణిస్తోంది. కరోనా కాలంలో ప్రేమలో పడిన వీరిద్దరూ పెద్దల అనుమతితో పెళ్లిపీటలెక్కారు. అయితే ఇటీవల ధనశ్రీకి సంబంధించి కొన్ని రూమర్లు బయటకు రావడం, అదే సమయంలో సోషల్ మీడియాలో ఇద్దరూ పోస్టులు పెట్టడంతో వీరి బంధానికి బ్రేక్ పడుతుందేమోనని వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ పుకార్లేనని మరోసారి చాటిచెప్పే ప్రయత్నం చేశారీ లవ్లీ కపుల్. కాగా కొరియోగ్రాఫర్‌గా, ఫేమస్ యూట్యూబర్‌గా రాణిస్తోన్న ధనశ్రీ ప్రస్తుతం పూర్తిగా విశ్రాంతి తీసుకుంటోంది. డ్యా్న్స్ చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తూ లిగ్మెంట్ గతి తప్పిందని.. త్వరలోనే మరో సర్జరీ చేయించుకోబోతున్నట్లు తెలిపిందీ ముద్దుగుమ్మ.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..