Team India Squad For West Indies T20 Series: వచ్చే నెల అంటే జులైలో భారత జట్టు రెండు టెస్టులు, మూడు వన్డేలు; ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లు ఆడేందుకు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కాగా, ఇప్పటికే టెస్ట్, వన్డే సిరీస్‌లకు టీమిండియాను ప్రకటించగా, ఇప్పుడు టీ20 సిరీస్‌కు త్వరలో జట్టును ఎంపిక చేయనున్నారు. అయితే, టీ20 సిరిస్‌కు స్వ్కాడ్ ఎలా ఉంటుందనే దానిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. టీ20 ప్రపంచకప్‌ను అనుసరించి ఫ్యూచర్ జట్టును తయారుచేయాలనే ప్లాన్‌లో భాగంగా టీంను తయారు చేయనున్నట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో టీ20 జట్టులోకి కొత్తగా చాలామంది యువకులు ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆ లక్కీ ఛాన్స్ అందుకునే ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..
వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌లో 15 మంది సభ్యులతో కూడిన జట్టులో ముగ్గురు ఓపెనర్లకు అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. ఇందులో శుభ్‌మన్ గిల్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్ ఉండవచ్చు. దీంతో పాటు మిడిలార్డర్‌లో రింకూ సింగ్, జితేష్ శర్మ వంటి, తిలక్ వర్మ లాంటి యువ ఆటగాళ్లకు అవకాశం లభించవచ్చు.
టీ20 సిరీస్‌లో టీమిండియాకు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. గత టీ20 సిరీస్‌లలో హార్దిక్ కెప్టెన్సీని అందుకున్నాడు. ఇటువంటి పరిస్థితిలో ఫొట్టి ఫార్మాట్‌లో ఫ్యూచర్ కెప్టెన్‌గా కనిపించనున్నాడు. కాగా, సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో అనుభవజ్ఞులైన భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్‌లకు ఛాన్స్ దక్కనుంది. అదే సమయంలో స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్ ఉండవచ్చు.
టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టు – శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, యశస్వి జైస్వాల్, రింకు సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్‌కేపర్) , కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.
తొలి టీ20 – ఆగస్టు 4- క్వీన్స్ పార్క్ ఓవల్
2వ టీ20 – ఆగస్టు 6 – ప్రొవిడెన్స్ స్టేడియం
3వ టీ20 – ఆగస్టు 8 – ప్రొవిడెన్స్ స్టేడియం
4వ మ్యాచ్ – ఆగస్టు 12 – సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం
5వ మ్యాచ్ – ఆగస్టు 13 – సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..