Video: ఎవరు భయ్యా నువ్వు.. గాల్లోకి లేచి, ఒంటిచేత్తో కళ్లు చెదిరే క్యాచ్.. జైస్వాల్ బుర్ర కరాబ్ చేశావ్‌గా
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మార్చి 23న జరిగిన IPL 2025 రెండవ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఒత్తిడిలోకి నెట్టి సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తమ ఇన్నింగ్స్‌లో 287 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రాజస్థాన్ జట్టు బలమైన ఓపెనర్లు సంజు సామ్సన్, యశస్వి జైస్వాల్‌తో టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగారు.

రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మార్చి 23న జరిగిన IPL 2025 రెండవ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఒత్తిడిలోకి నెట్టి సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తమ ఇన్నింగ్స్‌లో 287 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రాజస్థాన్ జట్టు బలమైన ఓపెనర్లు సంజు సామ్సన్, యశస్వి జైస్వాల్‌తో టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగారు.
అయితే రాజస్థాన్ రాయల్స్ ప్లాన్స్ అనుకున్నట్లుగా ముందుకు సాగలేదు. సిమర్జీత్ సింగ్ తన మొదటి ఓవర్లోనే జైస్వాల్‌ను 5 బంతుల్లో కేవలం 1 పరుగు మాత్రమే ఇచ్చి అవుట్ చేశాడు. దీంతో మ్యాచ్ మొత్తం ఎస్‌ఆర్‌హెచ్ ఆధీనంలోకి వచ్చింది.
మనోహర్ కళ్లు చెదిరే క్యాచ్..
Rajasthan Royals ಮೊದಲ ವಿಕೆಟ್ ಪತನ.⚡
Super catch by ಕನ್ನಡಿಗ Abhinav Manohar! 👏
📺 ವೀಕ್ಷಿಸಿ | TATA IPL 2025 | #SRHvRR | LIVE NOW | ನಿಮ್ಮ JioHotstar & Star Sports 2 ಕನ್ನಡದಲ್ಲಿ.#IPLOnJioStar #IPL2025 #TATAIPL pic.twitter.com/G5DtSMNryi
— Star Sports Kannada (@StarSportsKan) March 23, 2025
రాజస్తాన్ ఇన్నింగ్స్ రెండవ ఓవర్లో ఇది చోటు చేసుకుంది. జైస్వాల్ బలమైన కట్ షాట్ ఆడాడు. కానీ, దానిపై తగినంత ఎత్తుకు చేరుకోలేకపోయాడు. బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో నిలబడి ఉన్న అభినవ్ మనోహర్, సర్కిల్ అంచున అద్భుతమైన వన్ హ్యాండ్ క్యాచ్‌ను తీసుకున్నాడు. అది జైస్వాల్‌కు వేసిన షార్ట్-పిచ్డ్ డెలివరీ. జైస్వాల్ దానిని ఆఫ్-సైడ్ ద్వారా బౌండరీ తరలించేందుకు ప్రయత్నించాడు. కానీ, చివరికి బాల్ గాలిలోకి లేచింది. మనోహర్ గాల్లోకి అమాంతం ఎగిరి తన ఎడమ చేతితో అద్భుతమైన క్యాచ్‌ను పట్టుకుని జైస్వాల్‌ను పెవిలియన్‌కు పంపాడు.
తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ భారీ స్కోర్..
ఈ మ్యాచ్ ప్రారంభంలో, ఇషాన్ కిషన్ 106 పరుగులు చేసి హైదరాబాద్‌ను 286/6 కు చేర్చాడు. ఇది IPL చరిత్రలో రెండవ అత్యధిక స్కోరుగా నిలిచింది. రాజస్థాన్ తరపున, తుషార్ దేశ్‌పాండే మూడు వికెట్లు పడగొట్టగా, మహీష్ తీక్షణ రెండు వికెట్లు పడగొట్టాడు.
ఈ కథనం రాసే సమయానికి రాజస్థాన్ రాయల్స్ 14.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..