IND Vs AUS: ఈ పిల్ల బచ్చాగాడికి విరాటే కరెక్ట్.. మళ్లీ జైస్వాల్‌ని గెలికిన కాన్స్టాస్

|

Dec 30, 2024 | 6:17 PM

బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లో 4వ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 184 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్లేయర్ యశస్వి జైస్వాల్, ఆసీసీ యువ ప్లేయర్ సామ్ కొన్ స్టాస్ మధ్య ఓ ఇంట్రెస్టింగ్ సంఘటన జరిగింది. సామ్ కొన్ స్టాస్  ఫీల్డింగ్ చేస్తూ తన మాటలతో స్లెడ్లింగ్ చేస్తున్నాడు. అతను యశస్వి ఏకాగ్రతను దెబ్బతీసేలా ప్రయత్నాలు చేశాడు. దీంతో యశస్వికి విసుగెంతుకు వచ్చింది. "నీ పని చేసుకో” అంటూ గట్టిగా యశస్వి కౌంటర్ ఇచ్చాడు.

IND Vs AUS: ఈ పిల్ల బచ్చాగాడికి  విరాటే కరెక్ట్.. మళ్లీ జైస్వాల్‌ని గెలికిన కాన్స్టాస్
Jaiswal
Follow us on

ఈరోజు మెల్‌బోర్నలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోపీ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ప్లేయర్ యశస్వి జైస్వాల్, ఆసీసీ యువ ప్లేయర్ సామ్ కొన్ స్టాస్ మధ్య ఓ ఇంట్రెస్టింగ్ సంఘటన జరిగింది. సామ్ కొన్ స్టాస్  ఫీల్డింగ్ చేస్తూ తన మాటలతో స్లెడ్లింగ్ చేస్తున్నాడు. అతను యశస్వి ఏకాగ్రతను దెబ్బతీసేలా ప్రయత్నాలు చేశాడు. దీంతో యశస్వికి విసుగెంతుకు వచ్చింది. “నీ పని చేసుకో” అంటూ గట్టిగా యశస్వి కౌంటర్ ఇచ్చాడు. దీన్ని చూసిన కామెంటేటర్లు సైతం యశస్వి ధైర్యానికి మెచ్చుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లో 4వ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 184 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో టీమిండియా 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడో మ్యాచ్ డ్రాగా ముగియగా, ఇప్పుడు నాలుగో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది.

మెల్‌బోర్న్‌లోని ఎంసీజీ మైదానంలో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లో భాగంగా 4వ మ్యాచ్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యంలో నిలిచింది. మొదట ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొదట ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా తరఫున శామ్ కొన్‌స్టాస్ (60), ఉస్మాన్ ఖ్వాజా (57), మార్నస్ లబుచానే (72) హాఫ్ సెంచరీ చేశారు. 4వ స్థానంలో వచ్చిన స్టీవ్ స్మిత్ (140) భారీ సెంచరీతో రాణించాడు. ఈ సెంచరీ సాయంతో ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా తరఫున బుమ్రా 4 వికెట్లు తీయగా, జడేజా 3 వికెట్లు తీశాడు.

దీంతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. అయితే 8వ నెంబర్‌లో బరిలోకి దిగిన నితీష్‌ కుమార్‌ రెడ్డి, వాషింగ్టన్‌ సుందర్‌లు అద్భుతమైన బ్యాటింగ్‌ను ప్రదర్శించారు. దీంతో సెంచరీ భాగస్వామ్యంతో 300ల మార్కును దాటేసింది. ఎట్టకేలకు 114 పరుగుల వద్ద నితీష్ కుమార్ రెడ్డి ఔట్ కావడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ 369 పరుగులకు ముగిసింది. ఆస్ట్రేలియా తరఫున కమిన్స్, బోలాండ్, నాథన్ లియాన్ తలో 3 వికెట్లు తీశారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి