2nd World Test Championship: భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటన ఇప్పటివరకు ఒడిదుడుకులతోనే కొనసాగుతోంది. జూన్‌లో ప్రారంభమైన ఈ పర్యటనను భారత జట్టు న్యూజిలాండ్‌తో జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌తో ప్రారంభించింది. ఈ ఫైనల్లో ఓటమితో ఇంగ్లండ్ పర్యటనను ప్రారంభించింది. అలాగే తొలి టెస్టు ఛాంపియన్ షిప్‌లోనూ ఘెరంగా ఓడిపోయింది. డబ్య్లూటీసీ ఓటమి నిరాశను అధిగమించి, భారత జట్టు ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌తో రెండవ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించింది. ఇందులో భారత్ బాగానే రాణించింది. అయితే లీడ్స్ టెస్ట్ ఓటమితో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. సిరీస్‌తో పాటు టెస్ట్ ఛాంపియన్‌షిప్ పట్టికలో ఇంగ్లండ్ సిరీస్‌లోని మూడవ మ్యాచ్‌లో భారత్‌ను ఓడించింది. దీంతో భారత్ మొదటి స్థానం నుంచి మూడో స్థానానికి దిగజారింది.
లీడ్స్ టెస్టుకు ముందు భారత్ 14 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. పాకిస్తాన్, వెస్టిండీస్ 12 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు, ఇంగ్లండ్ కేవలం 2 పాయింట్లతో నాల్గవ స్థానంలో ఉంది. లీడ్స్‌లో భారత్ ఇన్నింగ్స్ 76 పరుగులతో ఓటమిపాలైంది. దీంతో ఇంగ్లండ్ 14 పాయింట్లతో నిలిచింది. ఈ విజయం తర్వాత, పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్ స్థానంలో ఎటువంటి మార్పు లేదు. కానీ, భారత్ మాత్రం మూడో స్థానానికి పడిపోయింది. వెస్టిండీస్ రెండో స్థానంలో ఉండగా, ప్రస్తుతం పాకిస్తాన్ తొలి స్థానానికి చేరుకుంది.
అగ్రస్థానంలో పాకిస్తాన్..
భారత్, ఇంగ్లండ్ చెరో 14 పాయింట్లతో ఉండగా, పాకిస్తాన్ ,వెస్టిండీస్ తలో 12 పాయింట్లు కలిగి ఉన్నాయి. కానీ, ఈ పాయింట్లతో పాకిస్తాన్ టీం ఎలా టాప్ ప్లేస్‌లోకి చేరందని పలువురు డౌట్ పడుతున్నారు. రెండవ టెస్ట్ ఛాంపియన్‌షిప్ నూతన పాయింట్ల విధానంతోనే ఇలా జరిగింది. తొలి సీజన్ పాయింట్ల విధానాన్ని మార్చిన ఐసీసీ.. ప్రతీ టెస్ట్‌కు 12 పాయింట్ల విధానాన్ని తీసుకొచ్చింది. అంటే విజేత జట్టుకు 12 పాయింట్లు లభించనున్నాయి. పాయింట్ల పట్టికలో జట్ల స్థానం అత్యధిక పాయింట్లతో నిర్ణయించబడదు. టీంల స్థానం పాయింట్ల శాతంతో డిసైడ్ చేస్తారు.
ఈ కారణంగా భారత్, ఇంగ్లండ్ టీంలు ఇప్పటివరకు చెరో 36 పాయింట్ల కోసం పోరాడాయి. ఇందులో ఇద్దరికీ 14 పాయింట్లతో సమానంగా నిలిచాయి. ఈ కోణంలో ఇరుటీంలు 38.88 శాతం పాయింట్లు సాధించాయి. అదే సమయంలో, పాకిస్తాన్, వెస్టిండీస్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడాయి. ఇందులో రెండూ ఒక్కో మ్యాచ్ గెలిచాయి. సమానంగా పాయింట్లు సాధించాయి. దీంతో ఇరు టీంలకు 50.0 శాతం పాయింట్లు వచ్చాయి. అందుకే ఈ రెండు జట్లు అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి.
భారత్‌కు అత్యంత కఠినమైన టెస్ట్ ఛాంపియన్‌షిప్ సిరీస్…
అయితే, ఈ సిరీస్‌లో ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. రెండవ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇది మొదటి సిరీస్. ప్రతీ జట్టు ఛాంపియన్‌షిప్‌లో 6 టెస్ట్ సిరీస్‌లు ఆడాల్సి ఉంటుంది. ఇందులో 3 స్వదేశంలో, 3 విదేశాలలో ఆడాల్సి ఉంటుంది. విదేశీ సిరీస్‌ల విషయానికొస్తే, టీమిండియాకు ఇంగ్లండ్ నుంచే కష్టమైన సవాలు మొదలైంది.
Also Read:
IND vs ENG: టీమిండియాకు మరో షాక్.. లీడ్స్ టెస్టులో గాయపడిన మరో ఆటగాడు..!