WTC Final 2023: ఓవల్ మైదానం బయట టీమిండియా ఫ్యాన్స్ సందడి.. వైరల్ అవుతున్న ‘జీతేగా జీతేగా, ఇండియా జీతేగా’ వీడియో..

|

Jun 07, 2023 | 5:10 PM

WTC Final 2023-Team India Fans: భారత్, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్‌ టెస్టు చాంపియన్‌ షిప్‌ ఫైనల్‌ టెస్టు బుధవారం ప్రారంభమైంది. లండన్‌లోని ఓవల్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌‌ని చూసేందుకు పెద్ద సంఖ్యలో టీమిండియా అభిమానులు అక్కడకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి..

WTC Final 2023: ఓవల్ మైదానం బయట టీమిండియా ఫ్యాన్స్ సందడి.. వైరల్ అవుతున్న ‘జీతేగా జీతేగా, ఇండియా జీతేగా’ వీడియో..
Team India Fans; Wtc Final 2023
Follow us on

WTC Final 2023-Team India Fans: భారత్, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్‌ టెస్టు చాంపియన్‌ షిప్‌ ఫైనల్‌ టెస్టు బుధవారం ప్రారంభమైంది. లండన్‌లోని ఓవల్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌‌ని చూసేందుకు పెద్ద సంఖ్యలో టీమిండియా అభిమానులు అక్కడకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందే ఓవల్ స్టేడియంలో టీమిండియా ఫ్యాన్స్ సందడి వాతావరణాన్ని నెలకొల్పారు. భారత త్రివర్ణ పతాకాన్ని చూపిస్తూ ఈ మ్యాచ్‌ ప్రారంభానికి ముందు భారత క్రికెట్‌ అభిమానులు స్టేడియం ఆవరణలో సందడి చేశారు. అలాగే స్టేడియం బయట నిలబడి త్రివర్ణ పతాకాన్ని చూపిస్తూ ‘జీతేగా జీతేగా.. ఇండియా జీతేగా’ అంటూ నినాదించారు.

ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరోవైపు మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత్, ఆస్ట్రేలియా టీమ్ ఆటగాళ్లు ఒడిశా రైలు ప్రమాదంలో మరణించినవారికి సంతాపం తెలిపారు. అలాగే నల్ల బ్యాడ్జీలు ధరించి మైదానంలోకి దిగి ఆట ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి


కాగా, ఇది ఇరు జట్ల కెప్టెన్లు రోహిత్ శర్మ, ప్యాట్ కమ్మిన్స్‌కు తమ కెరీర్‌లో 50వ టెస్ట్ మ్యాచ్. అది కూడా డబ్ల్యూటీసీ 2023 టైటిట్ కోసం జరుగుతున్న మ్యాచ్ తమకు 50వ టెస్ట్ కావడంతో ఎలా అయినా ఇందులో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఇంకా ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన టీమ్ క్రికెట్ చరిత్రలో అన్ని ఫార్మాట్లలోనూ ప్రపంచ విజేతగా నిలిచిన తొలి టీమ్‌గా అవతరిస్తుంది.

డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌ తుది జట్లు

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్) శుభమాన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కెఎస్ భరత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

ఆస్ట్రేలియా: ప్యాట్ కమ్మిన్స్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..