WTC Final 2023: తుదిజట్టులో అశ్విన్‌ లేకపోవడానికి కారణమదే.. టీమిండియా సారథి ఏం చెప్పాడంటే..?

|

Jun 07, 2023 | 4:02 PM

WTC Final 2023: అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌ మ్యాచ్ ప్రారంభమైంది. ఓవల్ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ తొలుత బౌలింగ్..

WTC Final 2023: తుదిజట్టులో అశ్విన్‌ లేకపోవడానికి కారణమదే.. టీమిండియా సారథి ఏం చెప్పాడంటే..?
R Ashwin; WTC Final 2023
Follow us on

WTC Final 2023: అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌ మ్యాచ్ ప్రారంభమైంది. ఓవల్ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సందర్భంగా ఫైనల్ మ్యాచ్ ఆడే ప్లేయింగ్ ఎలెవన్‌ని ప్రకటించాడు. ఇక ఈ ఫైనల్ మ్యాచ్‌ ఆడే జట్టులో ప్రపంచ టెస్ట్ క్రికెట్‌లో నెం.1 బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌కి రోహిత్ స్థానం కల్పించలేదు. ఆసీస్ టీమ్‌తోనే ఇటీవల జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విజృంభించిన అశ్విన్‌కి టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌ ఆడేందుకు అవకాశం ఇవ్వకపోవడం అందిరికీ ఆశ్చర్యం కలిగించింది.

అయితే తుది జట్టులో అశ్విన్‌కి స్థానం కల్పించకపోవడానికి కారణం లేకపోలేదు. ఇంకా ఈ విషయంపై రోహిత్ మాట్లాడుతూ ‘ఇది చాలా కష్టమైన నిర్ణయం, అయితే ఓవల్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే మేము నలుగురు ఫాస్ట్ బౌలర్లను ఎంచుకోవలసి ఉంది. ఎన్నో సార్లు టీమిండియా తరఫున మ్యాచ్‌లను గెలిపించిన అశ్విన్ మ్యాచ్ విన్నర్. కానీ జట్టు అవసరాలను మనం గుర్తుంచుకోవాలి’ అని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. ఓవల్ పిచ్‌పై పచ్చిక, బౌన్స్ అశ్విన్‌కి ఎదురుదెబ్బ అని చెప్పుకోవాలి. ఆ మైదానంలో బాల్ స్వింగ్ అవుతుంది కాబట్టి అదనపు ఫాస్ట్ బౌలర్‌ ఉండవలసిన అవసరం ఏర్పడింది. అందుకే అశ్విన్ స్థానంలో శార్దూల్‌కు చోటు దక్కింది. ఇంకా జడేజా గత రెండేళ్లలో బ్యాట్‌తో కూడా సత్తా చూపిస్తోన్న ఆల్‌రౌండర్. ఈ పరిస్థితుల నిమిత్తం అశ్విన్‌కి జట్టులో స్థానం లభించలేదు.

ఇవి కూడా చదవండి


కాగా, ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ టోర్నీ(2021-23)లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు. మొత్తం 13 మ్యాచులు ఆడిన అతను 61 వికెట్లు తీశాడు. ఈ క్రమంలో అతను రెండు సార్లు 5 వికెట్ హాల్ సాధించడం విశేషం. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన 4 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా అతను కీలక పాత్ర పోషించాడు. 4 టెస్టుల్లోనూ ఆడిన అశ్విన్ ఏకంగా 25 వికెట్లు పడగొట్టాడు.

డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌ తుది జట్లు:

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్) శుభమాన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కెఎస్ భరత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

ఆస్ట్రేలియా: ప్యాట్ కమ్మిన్స్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..