WTC Final 2023: ఓవల్‌ పోరులో గెలుపెవరిది.. ఉత్కంఠ పెంచుతోన్న భారత్, ఆస్ట్రేలియా రికార్డులు..

|

Jun 02, 2023 | 10:14 AM

IND vs AUS: భారత జట్టు జూన్ 7 నుంచి లండన్‌లోని ఓవల్‌లో ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ మైదానం భారత్, ఆస్ట్రేలియా రెండు జట్లకు తటస్థ వేదికలా మారింది. అయితే, ఈ గ్రౌండ్‌లో ఏ జట్టు గెలుస్తుందో చూడాల్సి ఉంది. అంతకంటే ముందు ఈ మైదానంలో ఇరు జట్ల టెస్టు రికార్డు ఎలా ఉందో ఓసారి తెలుసుకుందాం.

WTC Final 2023: ఓవల్‌ పోరులో గెలుపెవరిది.. ఉత్కంఠ పెంచుతోన్న భారత్, ఆస్ట్రేలియా రికార్డులు..
Ind Vs Aus
Follow us on

India vs Australia’s Record In Oval Ground: భారత జట్టు జూన్ 7 నుంచి లండన్‌లోని ఓవల్‌లో ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ మైదానం భారత్, ఆస్ట్రేలియా రెండు జట్లకు తటస్థ వేదికలా మారింది. అయితే, ఈ గ్రౌండ్‌లో ఏ జట్టు గెలుస్తుందో చూడాల్సి ఉంది. అంతకంటే ముందు ఈ మైదానంలో ఇరు జట్ల టెస్టు రికార్డు ఎలా ఉందో ఓసారి తెలుసుకుందాం.

ఓవల్‌లో భారత జట్టు రికార్డులు..

భారత జట్టు ఓవల్‌లో ఇప్పటివరకు 14 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో భారత జట్టు కేవలం 2 మాత్రమే గెలిచింది. 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 7 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. భారత జట్టు 2021లో ఇంగ్లండ్‌తో ఇక్కడ చివరి టెస్ట్ మ్యాచ్ ఆడింది., ఇందులో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమ్ ఇండియా 157 పరుగుల తేడాతో గెలిచింది. ఆ మ్యాచ్‌లో ప్రస్తుత భారత కెప్టెన్ రోహిత్ శర్మ 127 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

భారత్ కంటే పేలవంగా ఆస్ట్రేలియా రికార్డు..

ఆస్ట్రేలియా జట్టు ఇక్కడ ఇప్పటి వరకు మొత్తం 38 టెస్టు మ్యాచ్‌లు ఆడగా, అందులో ఆ జట్టు 7 మాత్రమే గెలిచి 17 ఓడిపోగా, 14 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.

ఇవి కూడా చదవండి

హోరాహోరీగా డబ్ల్యూటీసీ ఫైనల్..

భారత్-ఆస్ట్రేలియా మధ్య ఇప్పటి వరకు మొత్తం 106 టెస్టు మ్యాచ్‌లు జరగ్గా అందులో ఆస్ట్రేలియా 44 విజయాలు సాధించగా, 32 మ్యాచ్‌ల్లో భారత జట్టు విజయం సాధించింది. 29 మ్యాచ్‌లు డ్రాగా ముగియగా, ఒక మ్యాచ్ టై అయింది.

ఐసీసీ ట్రోఫీ కరువుకు స్వస్తి పలకేనా?

మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ రూపంలో చివరిగా ఐసీసీ ట్రోఫీని భారత్ గెలుచుకుంది. ఇటువంటి పరిస్థితిలో, 10 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఐసీసీ ట్రోఫీ కరువును టీమిండియా ఖచ్చితంగా ముగించాలనుకుంటోంది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి టీమ్ ఇండియా టైటిల్ గెలుచుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..