WTC 2027 : డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాతాళానికి పాకిస్థాన్.. టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే ?

WTC 2027 : వెస్టిండీస్ చేతిలో ఓటమితో పాకిస్థాన్ WTC 2025 - 27 పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పడిపోయింది. టీమిండియా ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఫైనల్ చేరాలంటే భారత్ మిగిలిన టెస్టుల్లో వరుస విజయాలు సాధించాల్సిన పరిస్థితి నెలకొంది.

WTC 2027 : డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాతాళానికి పాకిస్థాన్..  టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే ?
Wtc 2027

Updated on: Jul 29, 2026 | 10:01 AM

WTC 2027 : వెస్టిండీస్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ ఫలితంతో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. సొంతగడ్డపై ఆడుతున్న వెస్టిండీస్ జట్టు కేవలం నాలుగు రోజుల్లోనే పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. మొదటి టెస్టులో 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో వెస్టిండీస్ జట్టుకు ఊరట లభించగా, ఓటమి పాలైన పాకిస్థాన్ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.

పాకిస్థాన్ అట్టడుగుకి.. వెస్టిండీస్‌కు ప్రయోజనం

పాకిస్థాన్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు వరకు వెస్టిండీస్ జట్టు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అందరికంటే చిట్టచివరి స్థానంలో ఉండేది. అయితే తొలి టెస్టు గెలవడంతో సీన్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం మొత్తం 9 జట్ల పోటీలో వెస్టిండీస్ చివరి స్థానం నుంచి 8వ స్థానానికి ఎగబాకింది. మరోవైపు పాకిస్థాన్ దారుణంగా పడిపోయి ఆఖరిదైన 9వ స్థానానికి చేరుకుంది. ఈ సైకిల్‌లో ఇప్పటివరకు ఆడిన 11 టెస్టుల్లో 2 విజయాలు, 7 ఓటములు, 2 డ్రాలతో వెస్టిండీస్ పీసీటీ 22.73 శాతంగా ఉంది. అదే సమయంలో 5 టెస్టుల్లో కేవలం 1 గెలిచి, 4 మ్యాచ్‌ల్లో ఓడిపోయిన పాకిస్థాన్ పీసీటీ కేవలం 6.66 శాతానికి పడిపోయింది.

అగ్రస్థానంలో ఆస్ట్రేలియా.. రెండో స్థానంలో సౌతాఫ్రికా

డబ్ల్యూటీసీ 2025-27 పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా జట్టు తన ఆధిపత్యాన్ని చెక్కుచెదరకుండా కాపాడుకుంటోంది. ఇప్పటివరకు ఆడిన 8 టెస్టుల్లో 7 విజయాలు సాధించిన ఆస్ట్రేలియా 87.50 శాతం పిసిటితో నంబర్ 1 స్థానంలో దూసుకుపోతోంది. ఆస్ట్రేలియా తర్వాత సౌతాఫ్రికా జట్టు 4 టెస్టుల్లో 3 విజయాలు సాధించి 75.00 శాతం పిసిటితో రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు జట్లు ఫైనల్ వైపు బలంగా అడుగులు వేస్తున్నాయి.

టీమ్ ఇండియా ఫైనల్ చేరడం ఎలా?

అందరినీ ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత జట్టు బంగ్లాదేశ్ కంటే కూడా వెనుకబడి 5వ స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం న్యూజిలాండ్ మూడో స్థానంలో, బంగ్లాదేశ్ నాలుగో స్థానంలో ఉన్నాయి. భారత్ 5వ స్థానం నుంచి టాప్-2లోకి చేరి డబ్ల్యూటీసీ 2025-27 ఫైనల్ మ్యాచ్ ఆడాలంటే ఒకే ఒక మార్గం మిగిలి ఉంది. ఈ సైకిల్‌లో భారత్ ఆడబోయే తదుపరి 9 టెస్టు మ్యాచ్‌ల్లోనూ తప్పనిసరిగా విజయాలు సాధించాల్సి ఉంటుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us