AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WPL 2026 : ఈసారి కప్పు నమదే అంటున్న ఆర్సీబీ ఫ్యాన్స్..కానీ ముంబై ఒప్పుకుంటుందా?

WPL 2026 : ప్రస్తుతానికి పాయింట్ల పట్టికను గమనిస్తే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి 4 పాయింట్లు, అదిరిపోయే రన్ రేట్ (+1.964)తో అగ్రస్థానంలో నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచి రెండో స్థానంలో ఉంది. గుజరాత్ జెయింట్స్ కూడా రెండు విజయాలతో మూడో స్థానంలో ఉండి గట్టి పోటీ ఇస్తోంది.

WPL 2026  : ఈసారి కప్పు నమదే అంటున్న ఆర్సీబీ ఫ్యాన్స్..కానీ ముంబై ఒప్పుకుంటుందా?
Wpl 2026
Rakesh
|

Updated on: Jan 15, 2026 | 8:55 AM

Share

WPL 2026 : మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ ఈసారి సరికొత్త ఉత్సాహంతో సాగుతోంది. 2023లో మొదలైన ఈ లీగ్, ఇప్పుడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మహిళల లీగ్‌గా ఎదిగింది. ఈసారి టోర్నీని రెండు నగరాల్లో నిర్వహిస్తున్నారు. మొదటి సగం మ్యాచ్‌లు నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతుండగా, కీలకమైన రెండో సగం, ఫైనల్ మ్యాచ్ (ఫిబ్రవరి 5) వడోదర వేదికగా జరగనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ తమ ఆధిపత్యాన్ని చాటుతుండగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈసారి ఎవరూ ఊహించని రీతిలో దూసుకుపోతోంది.

ప్రస్తుతానికి పాయింట్ల పట్టికను గమనిస్తే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి 4 పాయింట్లు, అదిరిపోయే రన్ రేట్ (+1.964)తో అగ్రస్థానంలో నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచి రెండో స్థానంలో ఉంది. గుజరాత్ జెయింట్స్ కూడా రెండు విజయాలతో మూడో స్థానంలో ఉండి గట్టి పోటీ ఇస్తోంది. అయితే, వరుసగా మూడు సార్లు ఫైనల్ చేరిన ఢిల్లీ కాపిటల్స్ ఈసారి తడబడుతోంది. మూడు మ్యాచ్‌ల్లో కేవలం ఒక విజయాన్ని మాత్రమే నమోదు చేసి నాలుగో స్థానానికి పరిమితమైంది. ఇక యూపీ వారియర్స్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి పట్టికలో అట్టడుగున నిలిచింది.

డబ్ల్యూపీఎల్ చరిత్రను చూస్తే ముంబై ఇండియన్స్ అత్యంత విజయవంతమైన జట్టుగా ఉంది. మొదటి మూడు సీజన్లలో ముంబై రెండుసార్లు కప్పు కొట్టింది. ఆర్సీబీ ఒక్కసారి టైటిల్ సాధించింది. ఢిల్లీ కాపిటల్స్ మూడుసార్లు ఫైనల్ చేరినా, కప్పును ముద్దాడలేకపోయింది. ఈసారి ఫార్మాట్ ప్రకారం.. పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది. రెండు, మూడు స్థానాల్లో ఉన్న జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడి, గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. దీంతో టాప్ ప్లేస్ కోసం జట్ల మధ్య ఇప్పుడు వార్ నడుస్తోంది.

ఈ లీగ్ కేవలం స్టార్ ప్లేయర్లకే కాకుండా, భారత దేశవాళీ క్రికెట్ ఆడే ఎంతో మంది కుర్ర బ్యాటర్లకు, బౌలర్లకు లైఫ్ ఇస్తోంది. అంతర్జాతీయ ప్లేయర్లతో కలిసి ఆడటం వల్ల మన దేశీ ప్లేయర్ల ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. ముఖ్యంగా నవీ ముంబై పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలిస్తుండటంతో సిక్సర్ల వర్షం కురుస్తోంది. వడోదరలో జరిగే మ్యాచ్‌లు స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో, టోర్నీ రెండో సగం మరింత ఆసక్తికరంగా మారనుంది. ఢిల్లీ, యూపీ జట్లు వెంటనే పుంజుకోకపోతే ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకునే ప్రమాదం ఉంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

ఈసారి కప్పు నమదే అంటున్న ఆర్సీబీ ఫ్యాన్స్.. ముంబై ఒప్పుకుంటుందా ?
ఈసారి కప్పు నమదే అంటున్న ఆర్సీబీ ఫ్యాన్స్.. ముంబై ఒప్పుకుంటుందా ?
అసలైన చద్దన్నం ఇలా.. అలా తింటే అసలుకే మోసం..
అసలైన చద్దన్నం ఇలా.. అలా తింటే అసలుకే మోసం..
సొంత ఇల్లు కూడా లేదు.. వచ్చిన డబ్బులన్నీ దానికే ఖర్చు చేశా..
సొంత ఇల్లు కూడా లేదు.. వచ్చిన డబ్బులన్నీ దానికే ఖర్చు చేశా..
పండగ వేళ అదిరిపోయే గుడ్ న్యూస్.. వారందరి ఖాతాల్లో నిధుల జమ!
పండగ వేళ అదిరిపోయే గుడ్ న్యూస్.. వారందరి ఖాతాల్లో నిధుల జమ!
ఉప్పు నిజంగా మీ ఆరోగ్యానికి శత్రువా.. అపొహలు కాదు అసలు వాస్తవాలు
ఉప్పు నిజంగా మీ ఆరోగ్యానికి శత్రువా.. అపొహలు కాదు అసలు వాస్తవాలు
నవజాత శిశువును వదిలి వెళ్లిన తల్లికి కఠిన శిక్ష!
నవజాత శిశువును వదిలి వెళ్లిన తల్లికి కఠిన శిక్ష!
15 రోజుల షూటింగ్ తర్వాత సినిమా చేయను అని చెప్పింది.
15 రోజుల షూటింగ్ తర్వాత సినిమా చేయను అని చెప్పింది.
బ్యాడ్ న్యూస్.. కివీస్ సిరీస్ తర్వాత రోహిత్, కోహ్లీ ఆడేదెప్పుడు?
బ్యాడ్ న్యూస్.. కివీస్ సిరీస్ తర్వాత రోహిత్, కోహ్లీ ఆడేదెప్పుడు?
క్రెడిట్ కార్డ్ హోల్డర్ చనిపోతే ఆ బిల్ ఎవరు కట్టాలి.. ఈ రూల్స్..
క్రెడిట్ కార్డ్ హోల్డర్ చనిపోతే ఆ బిల్ ఎవరు కట్టాలి.. ఈ రూల్స్..
నమ్మశక్యం కాని విధంగా నటించాడు.. ఆశ్చర్యానికి లోనైన మహేశ్..
నమ్మశక్యం కాని విధంగా నటించాడు.. ఆశ్చర్యానికి లోనైన మహేశ్..