WPL Points Table: ప్లే ఆఫ్స్‌కు ముంబై ఇండియన్స్.. RCBకి సంక్లిష్టం.. పాయింట్ల పట్టిక ఎలా ఉందంటే?

మహిళల ప్రీమియర్ లీగ్ టోర్నీ రెండో ఎడిషన్ ఉత్కంఠగా జరుగుతోంది. ఫిబ్రవరి 23న ప్రారంభమైన టోర్నీలో ఇప్పటికే 16 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఢిల్లీ వేదికగా శనివారం (మార్చి 09) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మహిళల జట్టు గుజరాత్ జెయింట్స్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో WPL 2024 పాయింట్ల పట్టిక మారింది.

WPL Points Table: ప్లే ఆఫ్స్‌కు ముంబై ఇండియన్స్.. RCBకి సంక్లిష్టం.. పాయింట్ల పట్టిక ఎలా ఉందంటే?
WPL 2024

Updated on: Mar 10, 2024 | 8:19 AM

మహిళల ప్రీమియర్ లీగ్ టోర్నీ రెండో ఎడిషన్ ఉత్కంఠగా జరుగుతోంది. ఫిబ్రవరి 23న ప్రారంభమైన టోర్నీలో ఇప్పటికే 16 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఢిల్లీ వేదికగా శనివారం (మార్చి 09) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మహిళల జట్టు గుజరాత్ జెయింట్స్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో WPL 2024 పాయింట్ల పట్టిక మారింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ మహిళల జట్టు GGTపై గెలిచి పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో ఆ జట్టు నాకౌట్ దశకు చేరుకుంది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదు మ్యాచ్‌లు గెలిచి రెండు మ్యాచ్‌ల్లో ఓడి మొత్తం 10 పాయింట్లు సాధించింది హర్మన్ ప్రీత్ టీమ్‌. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ రన్ రేట్ +0.343గా ఉంది. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టు మొదటి స్థానం నుంచి రెండో స్థానానికి పడిపోయింది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచి రెండింట్లో ఓడి మొత్తం ఎనిమిది పాయింట్లు సాధించింది. ఢిల్లీ రన్ రేట్ +1.059. ఇక స్మృతి మంధాన సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మూడో స్థానంలో నిలవడంతో నాకౌట్‌కు చేరుకోవడం సంక్లిష్టంగా మారింది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో మూడు గెలిచి, మూడింటిలో ఓడిన ఆర్‌సీబీ మొత్తం 6 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. బెంగళూరు రన్ రేట్ +0.038.

ఇక యూపీ వారియర్స్ జట్టు ప్రస్తుత పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 4 గెలిచి 3 ఓడిపోయి 6 పాయింట్లు సాధించింది. UP రన్ రేట్ -0.365. ఇక మహిళల ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్‌లో గుజరాత్ జెయింట్స్ జట్టు పరిస్థితి దారుణంగా ఉంది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింటిలో ఓడి ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచి 2 పాయింట్లు సాధించింది. గుజరాత్ రన్ రేట్ -1.111 మాత్రమే. దీంతో మహిళల ప్రీమియర్ లీగ్ నుంచి గుజరాత్ దాదాపు నిష్ర్కమించినట్లే.

ఇవి కూడా చదవండి

 

 WPL లేటెస్ట్ పాయింట్ల పట్టిక..

నాకౌట్ కు చేరుకున్న ముంబై ఇండియన్స్…

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..