
WPL 2024, MIW vs RCBW, Ellyse Perry: ఈరోజు (మంగళవారం) ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2024 19వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MIW) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCBW)తో తలపడుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ జట్టుకు అదిరిపోయే ఆరంభం లిభించినా.. ఆజట్టు మిగతా బ్యాటర్లు మాత్రం చివరిదాకా నిలదొక్కుకోలేకపోయారు. బెంగళూరు ఫాస్ట్ బౌలర్ ఎల్లీస్ పెర్రీ చేతిలో చితికిపోయారు. ఎల్లీస్ పెర్రీ ఏకంగా ఆరుగురు ముంబై బ్యాటర్స్‌ను పెవిలియన్ చేర్చింది. దీంతో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని జట్టు 19 ఓవర్లకే 113 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో డబ్ల్యూపీఎల్ చరిత్రలో 6 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా పెర్రీ నిలిచింది.
The Perry Show! ⚡️⚡️
Four timber strikes and a six-wicket haul for Ellyse Perry 😲
Live 💻📱https://t.co/Xs3l4AyJSz#TATAWPL | #MIvRCB | @RCBTweets pic.twitter.com/uTjVaem5tP
— Women’s Premier League (WPL) (@wplt20) March 12, 2024
ఎలిస్ పెర్రీ 4 ఓవర్లు బౌలింగ్ చేసింది. ఈ సమయంలో, ఆమె 3.80 ఎకానమీ వద్ద 15 పరుగులకు 6 వికెట్లు పడగొట్టింది. తొలుత ఎస్ సజ్నాను బౌల్డ్ చేసింది. సజ్నా 21 బంతుల్లో 30 పరుగులు చేసింది. ఆ తర్వాతి బంతికే ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను బౌల్డ్ చేసింది. కౌర్ గోల్డెన్ డక్ బాధితురాలిగా మారింది. ఆమె 11వ ఓవర్ తొలి బంతికి అమేలియా కెర్‌ను ఎల్‌బీడబ్ల్యూగా అవుట్ చేసింది. కెర్ 5 బంతుల్లో 2 పరుగులు చేసింది. ఆ ఓవర్ మూడో బంతికి అమన్‌జోత్ కౌర్‌ను ఎలిస్ పెర్రీ బౌల్డ్ చేసింది. కౌర్ 2 బంతుల్లో 4 పరుగులు చేసింది. ఎలిస్ పెర్రీ 13వ ఓవర్ మూడో బంతికి పూజా వస్త్రాకర్‌ను బౌల్డ్ చేసింది. పూజ 10 బంతులు ఎదుర్కొని 6 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎల్లిస్ పెర్రీ ఓవర్ చివరి బంతికి నాట్ స్కివర్-బ్రంట్ LBW అవుట్ చేసింది. నాట్ 15 బంతుల్లో 1 ఫోర్ సాయంతో 10 పరుగులు చేసింది.
5 wicket-haul ✅
Best Bowling figures ✅#TATAWPL witnessed a special performance from @EllysePerry tonight 😍Live 💻📱https://t.co/6mYcRQlhHH#MIvRCB | @RCBTweets pic.twitter.com/qIuKyqoqvF
— Women’s Premier League (WPL) (@wplt20) March 12, 2024
టోర్నీలో ఎల్లిస్ పెర్రీ బౌలింగ్ గురించి మాట్లాడితే, ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఆమె యూపీ వారియర్స్‌పై 2 ఓవర్లు బౌలింగ్ చేసింది. ఎటువంటి వికెట్ సాధించలేదు. ఆ తర్వాత గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్‌పై ఎలాంటి విజయాన్ని అందుకోలేకపోయాడు. కొన్ని మ్యాచ్‌లలో, ఆమె బౌలింగ్ కూడా చేయలేదు. కానీ, కీలక మ్యాచ్‌లలో బంతితో మాత్రం సహకారం అందించింది.
రెండు జట్ల ప్లేయింగ్ 11..
ముంబై ఇండియన్స్: హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, ప్రియాంక బాలా (వికెట్ కీపర్), హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), అమేలియా కెర్, అమంజోత్ కౌర్, ఎస్ సజ్నా, పూజా వస్త్రాకర్, హుమైరా కాజీ, షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ మోలినెక్స్, ఎల్లీస్ పెర్రీ, సోఫీ డివైన్, రిచా ఘోష్ (కీపర్), జార్జియా వేర్‌హామ్, దిశా కస్సట్, శ్రేయంక పాటిల్, ఆశా శోభన, శ్రద్ధా పోఖార్కర్, రేణుకా ఠాకూర్ సింగ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..