WPL 2024, DCW vs GG: టాస్ గెలిచిన గుజరాత్.. డూర్ డై మ్యాచ్‌లో రాణించేనా?

WPL 2024, DCW vs GG: ఢిల్లీ క్యాపిటల్స్ టోర్నీలో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడి 5 విజయాలు సాధించింది. 10 పాయింట్లతో ఆ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. మరోవైపు గుజరాత్ జెయింట్స్ ఆడిన 7 మ్యాచ్‌ల్లో కేవలం 2 మాత్రమే గెలిచింది. ఆ జట్టు 4 పాయింట్లతో పట్టికలో చివరి స్థానంలో ఉంది.

WPL 2024, DCW vs GG: టాస్ గెలిచిన గుజరాత్.. డూర్ డై మ్యాచ్‌లో రాణించేనా?
Wpl 2024, Dcw Vs Gg

Updated on: Mar 13, 2024 | 7:26 PM

WPL 2024, DCW vs GG: నేడు, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2024 లీగ్ దశలోని 20వ, చివరి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ (GG) ఢిల్లీ క్యాపిటల్స్ (DCW)తో తలపడుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. గుజరాత్ ప్లేయింగ్ 11లో ఎలాంటి మార్పు లేదు. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఒక్క మార్పుతో రంగంలోకి దిగింది. మిన్ను మణికి చివరి 11లో చోటు దక్కింది.

టోర్నీలో ఇరు జట్ల ప్రదర్శన..

ఢిల్లీ క్యాపిటల్స్ టోర్నీలో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడి 5 విజయాలు సాధించింది. 10 పాయింట్లతో ఆ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. మరోవైపు గుజరాత్ జెయింట్స్ ఆడిన 7 మ్యాచ్‌ల్లో కేవలం 2 మాత్రమే గెలిచింది. ఆ జట్టు 4 పాయింట్లతో పట్టికలో చివరి స్థానంలో ఉంది.

రెండు జట్ల ప్లేయింగ్ 11..

ఢిల్లీ క్యాపిటల్స్‌: మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, అలిస్ క్యాప్సే, మారిజాన్ కాప్, జెస్ జోనాస్సెన్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, తానియా భాటియా (వికెట్ కీపర్), శిఖా పాండే, మిన్ను మణి.

గుజరాజ్ జెయింట్స్: లారా వోల్వార్డ్ట్, బెత్ మూనీ (కెప్టెన్, కీపర్), డేలాన్ హేమ్లత, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఆష్లే గార్డనర్, భారతీ ఫుల్మాలి, కేథరిన్ బ్రైస్, తనూజా కన్వర్, షబ్నమ్ ఎండీ షకీల్, మేఘనా సింగ్, మన్నత్ కశ్యప్.

డీసీడబ్ల్యూదే పైచేయి..

గుజరాత్ జెయింట్స్ (జీజీ), ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీడబ్ల్యూ) మధ్య హెడ్ టు హెడ్ గణాంకాలను పరిశీలిస్తే డీసీడబ్ల్యూదే పైచేయిగా నిలిచింది. డబ్ల్యూపీఎల్‌లో ఇరు జట్లు ఇప్పటి వరకు 3 సార్లు తలపడగా, డీసీడబ్ల్యూ 2 సార్లు గెలిచింది. WPL 2024 10వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 25 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించింది. ఇది కాకుండా, WPL 2023లో రెండు జట్లు రెండుసార్లు తలపడ్డాయి. గత సీజన్‌లో 9వ మ్యాచ్‌లో DCW 10 వికెట్ల తేడాతో GGని ఓడించింది. తొలి సీజన్‌లోని 14వ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 11 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..