Video: డ్యాన్స్‌లే కాదు.. క్యాచ్‌లు పట్టడంలోనూ సూపరే.. లాంగ్ డైవ్‌తో షాకిచ్చిన టీమిండియా ఆల్ రౌండర్..

|

Mar 21, 2023 | 6:41 AM

Jemimah Rodrigues: ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జెమీమా రోడ్రిగ్స్ రెండు మంచి క్యాచ్‌లతో పాటు ఒక రనౌట్‌ చేసింది. దీంతో ముంబైని కేవలం 109 పరుగుల స్వల్ప స్కోరుకు పరిమితం చేయడంలో కీలకపాత్ర పోషించింది.

Video: డ్యాన్స్‌లే కాదు.. క్యాచ్‌లు పట్టడంలోనూ సూపరే.. లాంగ్ డైవ్‌తో షాకిచ్చిన టీమిండియా ఆల్ రౌండర్..
Jemimah Rodrigues Diving Catch
Follow us on

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2023)లో ఢిల్లీ క్యాపిటల్స్ నిలకడగా రాణిస్తోంది. ఢిల్లీ జట్టు ప్లేఆఫ్‌లకు చేరుకుంది. ఢిల్లీ బలమైన ప్రదర్శనలో యువ భారత బ్యాట్స్‌మెన్ జెమీమా రోడ్రిగ్స్ కూడా కీలక పాత్రో పోషించింది. డబ్ల్యూపీఎల్‌ టోర్నమెంట్‌లో స్థిరంగా రాణిస్తోంది. జెమీమా తన బ్యాట్‌తో సత్తా చూపించడమే కాకుండా.. టోర్నీని ఆహ్లాదకరంగా మార్చి మైదానంలో తన డ్యాన్స్‌తో అభిమానులను అలరిస్తోంది. వీటన్నింటితో పాటు, జెమీమా తన అద్భుతమైన ఫీల్డింగ్‌తో భయాందోళనలు సృష్టిస్తోంది. ఇప్పటికే డబ్ల్యూపీఎల్‌లో ఆశ్చర్యకరమైన క్యాచ్ పట్టిన జెమీమా మళ్లీ అద్భుతమైన మరో క్యాచ్ పట్టి షాకిచ్చింది.

మార్చి 20, సోమవారం డీవై పాటిల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌కు వ్యతిరేకంగా, ఈ ఢిల్లీ ప్లేయర్ అద్భుతమైన డైవ్ చేయడం ద్వారా స్టన్నింగ్ క్యాచ్ తీసుకుంది. ఇది ముంబైపై ఒత్తిడిని పెంచడంలో కీలక పాత్ర పోషించింది. స్కోరు 10 పరుగుల వద్ద ఉండగా, ముంబై తొలి మూడు ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయింది.

ఇవి కూడా చదవండి

జెమిమా డైవింగ్ క్యాచ్ అదుర్స్..


నాల్గవ ఓవర్‌లో, మూడో బంతిని మిడ్-ఆన్‌లో ఆడేందుకు శిఖా పాండే చేసిన ప్రయత్నం ఫలించలేదు. అక్కడ ఉన్న జెమీమా తన కుడివైపున కొన్ని అడుగులు పరిగెత్తుతూ లాంగ్ డైవ్ చేసి, అద్భుతమైన క్యాచ్‌ను అందుకుంది. ఈ క్యాచ్ చూసి అంతా షాక్ అయ్యారు.

ఇదే మ్యాచ్‌లో మరోసారి..

ఆ తర్వాత జెమీమా క్యాచింగ్‌లో తన ప్రతిభను కొనసాగించింది. బౌండరీ వద్ద ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ ఇచ్చిన అద్భుతమైన క్యాచ్ అందుకుంది. అదే సమయంలో ఇన్నింగ్స్ చివరి బంతికి అమంజోత్ కౌర్‌ను రనౌట్ చేయడంలో కూడా కీలక పాత్ర పోషించింది. ఈ విధంగా ముంబైని కేవలం 109 పరుగులకే కట్టడి చేసేందుకు ఢిల్లీ బౌలర్లకు జెమీమా సహకరించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..