WPL 2023 Final: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 ఆరంభ సీజన్ ఫైనల్‌కు సర్వంసిద్ధమైంది. మార్చి 26 అంటే ఆదివారం రాత్రి ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. లీగ్ రౌండ్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి నేరుగా ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. ఢిల్లీ తర్వాత పాయింట్ల పట్టికలో 2, 3 స్థానాల్లో ఉన్న ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడగా.. ఈ మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌పై ముంబై ఇండియన్స్ 72 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్స్‌లోకి ప్రవేశించింది.
Dominant @DelhiCapitals will take on the mighty @mipaltan in the inaugural #TATAWPL final ?
ఇవి కూడా చదవండిTune in tomorrow & watch LIVE on @JioCinema and @Sports18 pic.twitter.com/9pbcAQKa6x
— Women’s Premier League (WPL) (@wplt20) March 25, 2023
ఫలితంగా డబ్ల్యూపీఎల్ తొలి ట్రోఫీ కోసం హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్, మెగ్ లానింగ్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఇక్కడ మరో విశేషమేమిటంటే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ నాయకత్వం వహిస్తుండగా, భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఫైనల్ డబ్ల్యూపీఎల్ ట్రోఫీ కోసమా..? లేక టీమిండియా-ఆసీస్ జట్టు కెప్టెన్ల సామర్థ్యం నిరూపించుకోవడానికా..? అని క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు.
The two skippers are ready to fight for the trophy ??
?: Mumbai Indians#CricketTwitter #WPL #MIvsDC pic.twitter.com/SKeH51FIE9
— Sportskeeda (@Sportskeeda) March 25, 2023
కాగా, లీగ్ దశలో తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 9 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌పై గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. అంటే లీగ్‌లో రెండు జట్లు కూడా సమఉజ్జీలుగా ఉన్నాయి. ఇక ఇప్పుడు డబ్య్లూపీఎల్ ఫైనల్ కూడా సమబలం కలిగిన ఈ రెండు జట్ల మధ్యే జరుగుతుండడంతో.. ప్రపంచ క్రికెట్ అభిమానులలో ట్రోఫీ ఎవరి సొంతమవుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఇక ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 7:30 గంటలకు ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ Sports18 నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. అలాగే మీరు Jio సినిమా యాప్, వెబ్‌సైట్‌లో కూడా లైవ్ స్ట్రీమ్‌ను ఉచితంగా చూడవచ్చు.
ఢిల్లీ క్యాపిటల్స్: మెగ్ లానింగ్ (కెప్టెన్), జెమీమా రోడ్రిగ్జ్, అలిస్ క్యాప్సీ, షఫాలీ వర్మ, రాధా యాదవ్, శిఖా పాండే, మరిజాన్నె కప్, టైటాస్ సాధు, లారా హారిస్, మిన్ను మణి, జసియా అక్తర్, తారా నోరిస్, తానియా భాటియా, పూనమ్ యాదవ్, స్నేహా దీపి ., అరుంధతి రెడ్డి, అల్పనా మోండల్, జెస్ జోనాసన్.
ముంబై ఇండియన్స్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), నటాలీ సివర్, పూజా వస్త్రాకర్, యాస్తికా భాటియా, అమేలియా కెర్, షబ్నమ్ ఇస్మాయిల్, అమంజోత్ కౌర్, హేలీ మాథ్యూస్, హీథర్ గ్రాహం, ఇసాబెల్లె వాంగ్, క్లో ట్రయాన్, ప్రియాంక బాలా, ధారా గుజ్జర్, సైకా ఇషాక్, సోనమ్ ఖాజ్ , జింటిమణి కలితా, నీలం బిష్ట్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..