
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ శైలిని అనుకరించడం పిచ్చి పనని స్ట్రోక్ ప్లేయర్ కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు. అతనో ప్రత్యేక ఆటగాడని వెల్లడించాడు.‘రోహిత్‌లా బ్యాటింగ్‌ను అనుసరించడం మూర్ఖత్వమే. అతనిదో ప్రత్యేక శైలి. జోరు మీదన్నప్పుడు హిట్‌మ్యాన్ ప్రత్యేక గ్రహం నుంచి వచ్చినట్టు ఆడతాడు. వ్యక్తిగతంగా నేను చాలా చక్కగా ఆడుతున్నా. ఐతే పూర్తిగా సంతృప్తి లేదు. శుభారంభాలు చేసినా భారీ స్కోర్లు చేయడం లేదు’ అని రాహుల్ అన్నాడు.
‘భారీ స్కోర్లు చేయడం ఏ ఆటగాడికైనా గొప్పగా ఉంటుంది. వాళ్లు కోరుకొనేదీ అదే. నా బ్యాటింగ్ బాగుంది. ఇప్పుడు చేస్తున్న సరైన పనినే ఎక్కువ సేపు కొనసాగించాలని భావిస్తున్నా. మరింత మెరుగవ్వాలని ఆశిస్తున్నా. 60-70లు ఎలా చేస్తున్నానో భారీ స్కోరూ అలాగే చేయాలని అనుకుంటున్నా. సుదీర్ఘంగా ఆడితే కచ్చితంగా భారీ స్కోరు చేస్తాను. దాంతో జట్టుకు ప్రయోజనం కలుగుతుంది’ అని రాహుల్ అన్నాడు.
SEMIS, HERE WE COME. ?
Great win, Proud of this team. ??#CWC19 pic.twitter.com/4N3LxujwO2— K L Rahul (@klrahul11) July 2, 2019