షమీకి అన్యాయం చేశారు..అతని కోచ్ ఆవేదన

|

Jul 10, 2019 | 2:52 PM

న్యూజిలాండ్‌తో వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌కి మంచి ఫామ్‌లో ఉన్న ఫేసర్ షమీని పక్కనబెట్టడంపై అతని కోచ్ బద్రుద్దిన్ సిద్ధిఖీ అసంతృప్తి వ్యక్తంచేశాడు. సెమీఫైనల్ జట్టులో షమీకి చోటు కల్పించకపోవడం సరైన నిర్ణయం కాదంటూ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, జట్టు మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డారు. న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్‌కి షమీని పక్కనబెట్టిన జట్టు మేనేజ్‌మెంట్, అతని స్థానంలో భువనేశ్వర్ కుమార్‌కు చోటు కల్పించడం తెలిసిందే. వరల్డ్ కప్‌లో షమీ 14 వికెట్లు సాధించాడని గుర్తుచేసిన […]

షమీకి అన్యాయం చేశారు..అతని కోచ్ ఆవేదన
Follow us on

న్యూజిలాండ్‌తో వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌కి మంచి ఫామ్‌లో ఉన్న ఫేసర్ షమీని పక్కనబెట్టడంపై అతని కోచ్ బద్రుద్దిన్ సిద్ధిఖీ అసంతృప్తి వ్యక్తంచేశాడు. సెమీఫైనల్ జట్టులో షమీకి చోటు కల్పించకపోవడం సరైన నిర్ణయం కాదంటూ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, జట్టు మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డారు. న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్‌కి షమీని పక్కనబెట్టిన జట్టు మేనేజ్‌మెంట్, అతని స్థానంలో భువనేశ్వర్ కుమార్‌కు చోటు కల్పించడం తెలిసిందే.

వరల్డ్ కప్‌లో షమీ 14 వికెట్లు సాధించాడని గుర్తుచేసిన ఆయన…ఫాస్ట్ బౌలర్ నుంచి ఇంతకుమించి ఏమి ఆశించగలమని ప్రశ్నించాడు. వరల్డ్ కప్‌లో ఆడిన 4 మ్యాచ్‌లలో షమీ 14 వికెట్లు సాధించాడు. ఇందులో ఆఫ్గన్‌తో మ్యాచ్‌లో సాధించిన హ్యాట్రిక్ వికెట్లు కూడా ఉన్నాయి. భువనేశ్వర్‌ బ్యాటింగ్‌ కూడా చేయగలడని అతడిని ఎంచుకున్నారన్న వాదన నిజమైందేనా?..ఒకవేళ అలా అయితే టాప్‌ 6 బ్యాట్స్‌మన్‌ బాగా ఆడినట్లయితే మిగతా వారితో పనేముంది? అసలు అది సరైన కారణమని ఎవరైనా అపేకుంటారా? అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కాగా సెమీస్ మ్యాచ్‌కు షమీని తీసుకోకపోవడంపై పలవురు క్రీడారంగ నిపుణులు. సీనియర్ ఆటగాళ్లు  సైతం ఆశ్చర్యం వక్తం చేస్తున్నారు. నిన్నటి సెమీ ఫైనల్‌ మ్యాచ్‌కి వరుణుడు అడ్డుతగలడంతో మ్యాచ్‌ నిలిపేసిన విషయం తెలిసిందే. రిజర్వ్‌ డే ప్రకారం.. ఈరోజు మళ్లీ ఆట ప్రారంభం కానుంది.