World Cup 2023, IND vs PAK: పాకిస్తాన్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ.. అహ్మదాబాద్‌లోనే దాయాదుల పోరు.. ఎప్పుడంటే?
Narendra Modi Stadium: వన్డే ప్రపంచకప్‌నకు ముందు పాకిస్థాన్‌కు ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది. నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్‌తో ఆడకూడదన్న పాకిస్థాన్ అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించిందని తెలుస్తోంది.
World Cup 2023 IND vs PAK: వన్డే ప్రపంచ కప్ 2023కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అయితే, భారత్-పాక్ మ్యాచ్‌కు సంబంధించి విషయాలు స్పష్టంగా లేవు. నివేదికల ప్రకారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. భారత్‌తో జరిగే మ్యాచ్ వేదికను మార్చాలని ఐసీసీ, బీసీసీఐలను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కోరింది.
కానీ, నివేదికల ప్రకారం, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్, భారత క్రికెట్ నియంత్రణ మండలి రెండూ పాకిస్తాన్ అభ్యర్థనను తిరస్కరించాయని తెలుస్తోంది. ప్రపంచకప్‌నకు ముందు జరగనున్న ఆసియాకప్ విషయంలో భారత్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నిజానికి పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ ఆడేందుకు బీసీసీఐ నిరాకరించింది.
అహ్మదాబాద్‌లో భారత్‌తో లీగ్ మ్యాచ్ ఆడబోమని పాకిస్తాన్ స్పష్టం చేసింది. ఇది కాకుండా, పాకిస్తాన్ జట్టు చెన్నైలో ఆఫ్ఘనిస్తాన్‌తో, బెంగుళూరులో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లు ఆడకూడదని మీడియా నివేదికలలో పేర్కొంది. చెన్నై, బెంగళూరు రెండింటిలోనూ వేదికలను మార్చుకోవాలని పీసీబీ డిమాండ్ చేసింది.
పాకిస్థాన్ అభ్యర్థనను తిరస్కరించిన బీసీసీఐ, ఐసీసీ..
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను బీసీసీఐ, ఐసీసీ పూర్తిగా తిరస్కరించాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నిర్ణయించిన ముసాయిదా షెడ్యూల్ ప్రకారం భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. అంటే అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ప్రపంచకప్ లీగ్ మ్యాచ్ జరగనుంది.
టోర్నీకి సంబంధించిన అధికారిక షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఇంకా ప్రకటించకపోవడం గమనార్హం. మీడియా నివేదికల ప్రకారం, పాకిస్తాన్ కారణంగా, ప్రపంచ కప్ అధికారిక షెడ్యూల్ విడుదల చేయడంలో జాప్యం జరుగుతోంది. అయితే, నేడు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..