Women’s T20 World Cup Final: మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా హ్యాట్రిక్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ మైదానంలో జరిగిన ఫైనల్లో ఆ జట్టు 19 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. దీంతో ఆస్ట్రేలియా ఆరోసారి టోర్నీ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా ఓపెనర్ బెత్ మూనీ 79 పరుగులతో అజేయంగా నిలిచింది. అదే సమయంలో సౌతాఫ్రికా నుంచి ఓపెనర్ లారా వోల్వార్డ్ 61 పరుగులు చేసింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. బెత్ మూనీ జట్టు తరపున 79 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడింది. 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ లారా వోల్వార్డ్ 61 పరుగులతో ఇన్నింగ్స్ ఆడింది. కానీ, జట్టును గెలిపించలేకపోయింది.
ఆస్ట్రేలియా: మెగ్ లానింగ్ (కెప్టెన్), అలిస్సా హీలీ, బెత్ మూనీ, ఎల్లీస్ పెర్రీ, ఆష్లే గార్డనర్, తహ్లియా మెక్‌గ్రాత్, గ్రేస్ హారిస్, మేగాన్ షుట్, జెస్ జోనాసెన్, డి’ఆర్సీ బ్రౌన్, జార్జియా వేర్‌హామ్.
దక్షిణాఫ్రికా: సునే లూయస్ (కెప్టెన్), తాజ్మిన్ బ్రిట్స్, లారా వోల్వార్డ్ట్, మరియన్ కాప్, క్లో ట్రయాన్, అన్నెకే బాష్, నాడిన్ డి క్లెర్క్, సినాలో జాఫ్తా (కీపర్), షబ్నిమ్ ఇస్మాయిల్, అయాబొంగా ఖాకా, నాంకులులేకో మ్లాబా.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..