WPL vs PSL: ఇదేందయ్యా ఆజామూ.. మీరు మరీ ఇంత చీపా.. బీసీసీఐ దెబ్బకు ఏకిపారేస్తోన్న నెటిజన్లు..

BCCI: బీసీసీఐ మహిళల ప్రీమియర్ లీగ్‌లోని మొత్తం ఐదు జట్లను ప్రకటించింది. అహ్మదాబాద్ అత్యంత ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి అంటే రూ. 1289 కోట్లు వెచ్చించి ఓ జట్టును కొనుగోలు చేసింది.

WPL vs PSL: ఇదేందయ్యా ఆజామూ.. మీరు మరీ ఇంత చీపా.. బీసీసీఐ దెబ్బకు ఏకిపారేస్తోన్న నెటిజన్లు..
Psl Vs Wpl

Updated on: Jan 25, 2023 | 7:26 PM

బీసీసీఐ మహిళల ప్రీమియర్ లీగ్‌లోని మొత్తం ఐదు జట్లను నేడు ప్రకటించారు. బుధవారం జరిగిన టీమ్ వేలంలో బీసీసీఐ ఐదు జట్లను రూ. 4670 కోట్లకు విక్రయించింది. మహిళల ప్రీమియర్ లీగ్‌లో అత్యంత ఖరీదైన జట్టు విలువ రూ.1289 కోట్లు కాగా, చౌకైన జట్టు విలువ రూ. 757 కోట్లుగా నిలిచింది. నేడు నిర్వహించిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం ఐపీఎల్ 2008 రికార్డును బ్రేక్ చేసింది. మరోవైపు, పాకిస్తాన్ సూపర్ లీగ్ అంటే పీఎస్‌ఎల్ మహిళల ప్రీమియర్ లీగ్ ముందు ఎక్కడా నిలబడలేకపోయింది.

పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో జట్లు ఎంత ధరకు అమ్ముడయ్యాయంటే..

పాకిస్థాన్ సూపర్ లీగ్ డబ్బు విషయంలో మహిళల ప్రీమియర్ లీగ్ ముందు వెనుకంజలో నిలిచింది. 2015లో, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తన ఐదు జట్లను 93 మిలియన్ డాటర్లకు విక్రయించింది. ఆ తరువాత, 2019 లో ఈ లీగ్ ఆరవ జట్టు 6.35 మిలియన్ డాలర్లకు విక్రయించారు. పీఎస్‌ఎల్ మొత్తం 6 జట్లు మొత్తం ధర 100 మిలియన్ డాలర్లు కూడా లేదు. ఈ లీగ్‌లోని అన్ని జట్లను నేటి డాలర్ రేటుతో లెక్కించినా, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లోని ఒక జట్టుతో సమానంగా లేకపోవడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

ఏ పీఎస్‌ఎల్ జట్టు ఎంతకు అమ్ముడయ్యాయంటే?

కరాచీ కింగ్స్ – 26 మిలియన్ డాలర్లు

ఇస్లామాబాద్ యునైటెడ్ టీమ్ – 15 మిలియన్ డాలర్లు

ముల్తాన్ సుల్తాన్ – 6.35 మిలియన్ డాలర్లు

లాహోర్ క్వాలండర్స్ – 25.1 మిలియన్ డాలర్లు

పెషావర్ జల్మీ – 16 మిలియన్ డాలర్లు

క్వెట్టా గ్లాడియేటర్స్ – 11 మిలియన్ డాలర్లు

మహిళల ప్రీమియర్ లీగ్ జట్ల ధర..

అహ్మదాబాద్: రూ. 1289 కోట్లు

ముంబై: రూ. 912.99 కోట్లు

బెంగళూరు: రూ. 901 కోట్లు

ఢిల్లీ: రూ. 810 కోట్లు

లక్నో : రూ. 757 కోట్లు

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..