కొడుకు పోర్న్ ఛానల్ కోసం… తల్లి సాహసం!

|

Jul 15, 2019 | 5:07 PM

లండన్: ప్రఖ్యాత లార్డ్స్ మైదానం వేదికగా ఆతిధ్య ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. న్యుజిలాండ్ ఇన్నింగ్స్ సమయంలో ఓ మహిళా స్ట్రీకర్ స్విమ్ సూట్‌ను పోలిన నల్లని డ్రెస్‌ను ధరించిన అకస్మాత్తుగా మైదానంలోకి దూసుకెళ్లబోయింది. అయితే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వెంటనే గమనించి అడ్డుకున్నారు. ఇక ఆ మహిళ వివరాలు తెలుసుకోగా.. తన కొడుకు పోర్న్ యూట్యూబ్ ఛానల్ ప్రచారం కోసం ఇలా ఫైనల్ మ్యాచ్ […]

కొడుకు పోర్న్ ఛానల్ కోసం... తల్లి సాహసం!
Follow us on

లండన్: ప్రఖ్యాత లార్డ్స్ మైదానం వేదికగా ఆతిధ్య ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. న్యుజిలాండ్ ఇన్నింగ్స్ సమయంలో ఓ మహిళా స్ట్రీకర్ స్విమ్ సూట్‌ను పోలిన నల్లని డ్రెస్‌ను ధరించిన అకస్మాత్తుగా మైదానంలోకి దూసుకెళ్లబోయింది. అయితే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వెంటనే గమనించి అడ్డుకున్నారు. ఇక ఆ మహిళ వివరాలు తెలుసుకోగా.. తన కొడుకు పోర్న్ యూట్యూబ్ ఛానల్ ప్రచారం కోసం ఇలా ఫైనల్ మ్యాచ్ జరిగే గ్రౌండ్‌లోకి వచ్చిందని తెలుస్తోంది.

గతంలో జరిగిన ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ మ్యాచ్ సమయంలోనూ.. అతని గర్ల్ ఫ్రెండ్ కూడా ఇలానే ప్రయత్నించిందని తెలుస్తోంది. ఇక యూట్యూబ్ ఛానల్ వ్యూస్ కోసం ఇలా అంతర్జాతీయ మ్యాచ్‌లను అడ్డుకోవడం సరికాదని ఫ్యాన్స్ తీవ్ర విమర్శలు చేశారు.