IPL 2025: చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరిన రిషబ్ పంత్? సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న ఫొటో..

|

Aug 21, 2024 | 5:26 PM

Rishabh Pant to join CSK: రిషబ్ పంత్ కొన్ని గంటల క్రితం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను పంచుకున్నాడు. ఈ పోస్ట్‌తో అతను చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరడం గురించి సోషల్ మీడియాలో చర్చలు తీవ్రమయ్యాయి. పంత్ వచ్చే ఏడాది కచ్చితంగా CSKలో చేరతాడని కొందరు వినియోగదారులు కామెంట్లు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే, ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రధాన కోచ్‌గా ఉన్న రికీ పాంటింగ్ ఫ్రాంచైజీతో విడిపోయాడు. ఈ క్రమంలో ఢిల్లీ జట్టు కొత్త ప్రధాన కోచ్ కోసం వెతుకుతోంది.

IPL 2025: చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరిన రిషబ్ పంత్? సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న ఫొటో..
Rishabh Pant
Follow us on

Rishabh Pant to join CSK: రిషబ్ పంత్ కొన్ని గంటల క్రితం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను పంచుకున్నాడు. ఈ పోస్ట్‌తో అతను చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరడం గురించి సోషల్ మీడియాలో చర్చలు తీవ్రమయ్యాయి. పంత్ వచ్చే ఏడాది కచ్చితంగా CSKలో చేరతాడని కొందరు వినియోగదారులు కామెంట్లు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే, ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రధాన కోచ్‌గా ఉన్న రికీ పాంటింగ్ ఫ్రాంచైజీతో విడిపోయాడు. ఈ క్రమంలో ఢిల్లీ జట్టు కొత్త ప్రధాన కోచ్ కోసం వెతుకుతోంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు, రిషబ్ పంత్ కూడా విడిపోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, దీనిపై ఇంకా ఎలాంటి నిర్ధారణ రాలేదు. ఇప్పుడు రిషబ్ పంత్ పోస్ట్ మళ్లీ ఊహాగానాలను పెంచేసింది.

పంత్ ఏం పోస్ట్ చేశాడంటే?

వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్‌ను పంచుకున్నాడు. ఈ పోస్ట్‌లో, పంత్ ప్రముఖ నటుడు రజనీకాంత్ ఫొటోను పంచుకున్నారు. అందులో ఇద్దరూ ఒకే విధంగా కూర్చున్నట్లు చూడొచ్చు. ఈ ఫొటో క్యాప్షన్‌లో పంత్ ‘తలైవా’ అంటూ రాశాడు. రజనీకాంత్‌ని ఆయన అభిమానులు ‘తలైవా’ అని ముద్దుగా పిలుస్తారనే విషయం తెలిసిందే. అభిమానులు ఈ పోస్ట్‌ను CSK మాజీ కెప్టెన్ MS ధోనీతో పోల్చుతున్నారు. దీంతో వినియోగదారులు పంత్ చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరబోతున్నాడంటూ కామెంట్లు చేస్తున్నాయి.

ఢిల్లీ క్యాపిటల్స్‌తో పంత్ విడిపోతాడా?

కొన్ని నివేదికల ప్రకారం, ఆటగాడిగా అతని రికార్డు ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ, కెప్టెన్‌గా పంత్ ప్రదర్శన పట్ల ఢిల్లీ క్యాపిటల్స్ సంతోషంగా లేదు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 111 మ్యాచ్‌లు ఆడిన పంత్, అందులో 3284 పరుగులతో జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 2016లో, పంత్ తన IPL అరంగేట్రం ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడాడు. అప్పటి నుంచి అదే జట్టుకు ఆడుతున్నాడు.

రిషబ్ పంత్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌పై చాలా మంది వినియోగదారులు కామెంట్ చేస్తున్నారు. ఒక వినియోగదారు, ‘CSKకి స్వాగతం’ అంటూ కామెంట్ చేయగా.. మరొక వినియోగదారుడు ‘Confirmed CSK’ అంటూ కామెంట్ చేయగా, ‘వచ్చే ఏడాది CSKలో ఖచ్చితంగా ఉంటాడు’ అంటూ మరొకరు కామెంట్ చేశాడు.