IND vs WI 2nd Test: ఏ తల్లి అయినా ప్రత్యర్థులపై తన కొడుకు కనబర్చే ప్రదర్శనను కనులారా తిలకించడానికి వెళ్తుంది. కానీ వెస్టిండీస్ టీమ్‌లోని ఓ ప్లేయర్ తల్లి మాత్రం తన కొడుకు కోసం కాకుండా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కోసమే ప్రత్యేకంగా క్రికెట్ స్టేడియానికి వచ్చింది. అవును, వెస్టిండీస్-భారత్ మధ్య జరుగుతోన్న రెండో టెస్ట్ రెండో రోజు ఆట చూసేందుకు విండీస్ వికెట్ కీపర్ జాషువా డా సిల్వా తల్లి వచ్చారు. 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతోన్న విరాట్ కోహ్లీ ఆట చూసేందుకు ఆమె వచ్చిన రోజే రన్ మెషిన్ 76వ సెంచరీతో చెలరేగడం విశేషం.
ఇక రెండో రోజు మ్యాచ్ అనంతరం టీమిండియా బస్ వద్దకు జాషువా తల్లి వచ్చి కోహ్లీని కలిసి ఎంతో ఆప్యాయంతో కౌగిలించుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘నేను, జాషువా విరాట్ కోహ్లీకి పెద్ద అభిమానులం. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో రెండో టెస్టు ఆడుతున్న తన అభిమాన క్రికెటర్ కోహ్లీ బ్యాటింగ్ చూసేందుకు మాత్రమే స్టేడియానికి వచ్చా. మా జీవితకాలంలో విరాట్ అత్యుత్తమ బ్యాట్స్‌మ్యాన్. అతనితో పాటు నా కొడుకు కూడా ఒకే మైదానంలో ఆడడం నాకు ఎంతో గౌరవంగా ఉంద’ని ఆమె పేర్కొంది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Virat Kohli is once in a life time sportsperson.
The respect, he has earned over a decade, What a beautiful video. pic.twitter.com/bDhizasC6U
— Johns. (@CricCrazyJohns) July 22, 2023
జాషువా-కోహ్లీ
Joshua da Silva couldn’t resist fanboying over King Kohli during the match.🤩#ViratKohli #WIvIND #Cricket pic.twitter.com/vWhBDSTwm1
— Sportskeeda (@Sportskeeda) July 21, 2023
కాగా రెండో రోజు జాషువా తల్లి వస్తుందన్న విషయాన్ని వెస్టిండీస్ ప్లేయర్ ముందుగానే చెప్పాడు. తొలి రోజు కోహ్లీ ఆడుతున్న సమయంలో జాషువా వికెట్ కీపింగ్ చేస్తూనే ‘విరాట్‌ని చూడటానికి వస్తున్నానని, నా ఆట చూసేందుకు కాదని మా అమ్మ ఫోన్‌లో చెప్పింది. మా అమ్మ అక్షరాలా అదే చెప్పింది. నేను నమ్మలేకపోయా. ఆమె నిజాయితీగా చెప్పినందుకు నేను తనను నిందించను. ఆమె చూస్తూనే ఉంది’ అన్నాడు. అందుకు సంబంధించిన మాటలు కూడా స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి. ఇక తొలి రోజు ఆట ముగిసే సరికి కోహ్లీ 87 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అలాగే ఆ రోజు టీమిండియా 4 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. రెండో రోజు విరాట్ కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు టీమిండియా 438 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ టీమ్ ఓ వికెట్ నష్టానికి 86 పరుగులు చేశారు.
మరిన్ని క్రికెట్ కథనాల కోసం క్లిక్ చేయండి.